రాష్ట్రం నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి

The state has developed in all fields in four years

The state has developed in all fields in four years

Date:11/01/2018
అమరావతి ముచ్చట్లు:
నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వయం కృషి, మన పట్టుదలతో దీనిని సాధించాం. విభజన కష్టాలను అధిగమించామని అన్నారు. జన్మభూమి చివరి రోజు నిర్వహణపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. విభజన రోజు దిక్కుతోచని స్థితి. ఇప్పుడు అద్భుత ప్రగతి సాధించాం. యావత్ ప్రపంచమే మన దిక్కు చూస్తోందని అన్నారు. ఇది నిజమైన సంక్రాంతి. ఇది రాష్ట్ర అభివృద్ధి సంక్రాంతి. ఇది పేదల సంక్షేమ సంక్రాంతి. ఇంత పెద్ద పండుగ ప్రజలకు చేరువ చేశారు. పాలనా యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలని అయన అన్నారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఆనందం, సంతృప్తి ఉంది. నిర్మాణంలో వచ్చినంత ఆనందం దేనిలోనూ రాదు. 2014లో కొందరు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపలేదు. కొంతమంది మాత్రమే ఏపి వచ్చేందుకు ఆసక్తి వుండింది.
ఏపి బృందాన్ని బలహీన బృందం అన్నారు. ఇప్పుడు ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అత్యున్నత రాష్ట్రం చేశాం. నాలుగేళ్లలో 670అవార్డులే మన కృషికి రుజువని అన్నారు. మీ త్యాగ ఫలితమే ఈ రోజు రాష్ట్రం ఈ స్థాయికి చేరింది. మీ కష్టార్జితం, సమష్టి కృషితోనే రాష్ట్రాభివృద్ధి. అధికార,ఉద్యోగ బృందాన్ని చూసి గర్విస్తున్నాను. గతంలో 9ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను ఒక్కడినే పరుగెత్తాను. ఇప్పుడు ఆ విధంగా కాదు. ఒక బృందంగా పరుగు తీస్తున్నాం.అందుకే ఫలితాలు కూడా గొప్పగా సాధిస్తాన్నాం. 16వేల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్ లోడ్ చేయడం రికార్డు. పోలవరం కాంక్రీట్ పనుల్లో గిన్నెస్ రికార్డు సాధించామని అయన అన్నారు. మనకంటె ఇతర రాష్ట్రాలు ముందుకు పోతే నాకు అసూయ. ఆ అసూయనే కసిగా మార్చుకుంటాను.
మరింత పట్టుదలతో పనిచేస్తాను. అనుకున్నది సాధించేందుకే మన అసూయ దోహదపడాలి. మన ప్రగతికి ఉపయోగ పడాలే తప్ప ఇతరులకు నష్టం కలగాలని అసూయ పడరాదని అయన అన్నారు. మన ఆర్టీజిని మొన్న టోని బ్లెయర్ ప్రశంసించారు. నిన్న ఈశ్వరన్ అభినందించారు. సింగపూర్ లో లేని వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాం. 1100పరిష్కార వేదిక ప్రపంచానికే నమూనా. పేదల సమస్యల సత్వర పరిష్కార వేదిక. మన ఎల్ ఈడి బల్బులు ఒక వినూత్న ఆవిష్కరణ. నరేగా నిధుల సమీకరణ ఒక ఆవిష్కరణ. ప్రకృతి వ్యవసాయం మరొక ఆవిష్కరణ అని అన్నారు. ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఒక చరిత్ర. లక్షా 30వేల మంది యువతకు ఉపాధి ఒక చరిత్ర. అదాని రూ.30వేల కోట్లతో డేటా పార్కులు, రూ.40వేల కోట్లతో సోలార్ పార్కులు విశాఖలో వస్తున్నాయి. ప్రకాశంలో కాగితం గుజ్జు పరిశ్రమ వస్తోంది. 50వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం వుందని అన్నారు.
సులభతర వాణిజ్యంలో మనమే ముందున్నాం. భవిష్యత్తులో ప్రపంచ దృష్టి మన డేటా సేవలపైనే ఉంటుంది. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ లు, ఐదు ఉద్యమాలతో మన ప్రయాణం ప్రారంభం. పట్టుదల పెంచేందుకే నవ నిర్మాణ దీక్ష,మహా సంకల్పం. ప్రజల భాగస్వామ్యం కోసమే జన్మభూమి-మా ఊరు, గ్రామ వికాసం,జలసిరికి హారతి కార్యక్రమాలు. కేంద్రం దేనికీ సహకరించడం లేదు. అయినా మన కష్టంతో ముందుకు వెళ్తున్నాం. చివరి రోజు జన్మభూమిని కూడా విజయవంతం చేయాలి. రేపటినుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలి. ఇప్పటివరకు 4,57,007 వినతులు అందాయి. అందులో 3,10,000 తనిఖీ చేశాం, పరిష్కరించాం.
35వేల వినతులు మాత్రమే తిరస్కరించామని అన్నారు. మొదటి జన్మభూమికి 40లక్షల వినతులు వచ్చాయి. ఈ జన్మభూమికి 4.5లక్షల వినతులు అందాయి. ప్రజల్లో సంతృప్తిశాతానికి ఇదే రుజువు. వినతుల సంఖ్య తగ్గడమే మన పనితీరుకు నిదర్శనం. అనేక సమస్యలు నాలుగేళ్లలో పరిష్కరించాం.అందుకే ప్రజల వినతులు కూడా తగ్గాయి.  ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా పనిచేయాలి. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి. ప్రపంచంలో అత్యున్నత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావాలని అయన అన్నారు.
Tags:The state has developed in all fields in four years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *