రాష్ట్రాభివృద్ధి తెదేపాతో సాధ్యం

The state of development

The state of development

Date:14/03/2019
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర అభివృద్ధి ఒక్క తెదేపాతోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే బి వి జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ఒకటి, రెండు వార్డులలో  గురువారం బి వి జయనాగేశ్వర రెడ్డి తండ్రి  బి వి మోహన్ రెడ్డి చిత్రపటంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల తెదేపా హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పట్టణంలో చేనేత కార్మికులకు టెక్స్ టైల్ పార్కు మంజూరు చేయించినట్లు వారు తెలిపారు. తన తండ్రి కీర్తిశేషులు బి వి మోహన్ రెడ్డి ఇక్కడి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశారని వివరించారు. 2014 ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించాను. మరొక్కసారి ఈ ఎన్నికల్లో కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులతోపాటు కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Tags:The state of development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *