స్టేషన్ ఘన్ పూర్ లో మూడు బీటీ రోడ్లకు నిధులు

The station is funded by three beati roads in ghanapur

The station is funded by three beati roads in ghanapur

DAte:13/07/2018
వరంగల్ ముచ్చట్లు:
ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, చేసిన కృషి ఫలితంగా వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లోని స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గ పరిధిలో రూ.24.15 కోట్ల విలువైన 3 బిటి రోడ్ల  పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.  వరంగల్ రూరల్ జిల్లాలోని వడ్డిగూడం, రేపాకపల్లి మీదుగా  ధర్మసాగర్ నుంచి దేవనూర్ వరకు 7.10 కిలోమీటర్ల రోడ్డు కోసం 9 కోట్ల రూపాయలు,  వరంగల్ రూరల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో మల్లికుదుర్ల మీదుగా నారాయణ గిరి ఎక్స్(X) రోడ్ నుంచి వెంకటేశ్వర్ల పల్లి వరకు 10 కిలోమీటర్ల రోడ్ కోసం 12 కోట్ల రూపాయలు,  జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో సముద్రాల నారాయణ పూర్ మీదుగా వెళ్లే 6.50 కిలోమీటర్ల తీగారం రోడ్డు కోసం 3.15 కోట్ల రూపాయల మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు.
 స్టేషన్ ఘన్ పూర్ లో మూడు బీటీ రోడ్లకు నిధులు https://www.telugumuchatlu.com/the-station-is-funded-by-three-beati-roads-in-ghanapur/
Tags:The station is funded by three beati roads in ghanapur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *