ఉక్కు పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కలెక్టర్ 

The steel industry is the collector who announces compensation to the families of the accident victims

The steel industry is the collector who announces compensation to the families of the accident victims

Date:14/07/2018
అనంతపురం ముచ్చట్లు:
గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీమా, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా, ఎన్జీవో తరపున పరిహారం చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఒక ప్రకటనలో తెలిపారు. బొళ్ల గురవయ్య కుటుంబానికి బీమా రూ 20,08,396లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. దీంతోపాటు ఈఎస్ ఐ నుంచి నెలకు రూ 18752 పెన్షన్ అందుతుంది.  కంసల మనోజ్ కుమార్ కుటుంబానికి బీమా రూ 17,40,000 లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. దీంతోపాటు ఈఎస్ ఐ నుంచి నెలకు రూ 8371  పెన్షన్ అందుతుంది.   షేక్ వసీం కుటుంబానికి బీమా రూ 28,74,743 లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. గంగాధర  కుటుంబానికి బీమా రూ 7,40,240  లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. దీంతోపాటు ఈఎస్ ఐ నుంచి నెలకు రూ 8550 పెన్షన్ అందుతుంది.   రంగనాధ్  కుటుంబానికి బీమా రూ 8,54,280 లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. దీంతోపాటు ఈఎస్ ఐ నుంచి నెలకు రూ 7200 పెన్షన్ అందుతుంది.   శివమద్దిలేతి రెడ్డి అలియాస్ లింగయయ్య కుటుంబానికి బీమా రూ 8,73,8800 లు, మేనేజ్ మెంట్ ఎక్స్ గ్రేషియా రూ 10 లక్షలు, ఎన్జీవో తరపున పరిహారం లక్ష రూపాయలు అందజేస్తారు. దీంతోపాటు ఈఎస్ ఐ నుంచి నెలకు రూ 10,800 పెన్షన్ అందుతుంది.   తాడిపత్రి ఎమ్మెల్యే ద్వారా ఎన్జీవో తరపున ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
ఉక్కు పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కలెక్టర్ https://www.telugumuchatlu.com/the-steel-industry-is-the-collector-who-announces-compensation-to-the-families-of-the-accident-victims/
Tags:The steel industry is the collector who announces compensation to the families of the accident victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *