క్యాస్టింగ్ కౌచ్ కధలెన్నో…

Date:16/04/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎంతో మంది యువతులను కాటేసింది. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని అవకాశాల కోసం వచ్చే వారిని ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, అనుభవించడం తద్వారా అవమానాలకు గురిచేయడమే హక్కుగా తయారైన టాలీవుడ్‌ ఇండస్ట్రీ చీకటి భాగోతాన్ని శ్రీరెడ్డి లీక్స్ బట్టబయలు చేసింది. శ్రీరెడ్డి ప్రారంభించిన నిరసన.. ఉద్యమ రూపం దాల్చడంతో ఎంతో మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి టాలీవుడ్ రసికరాజుల గుట్టును బట్టబయలు చేస్తున్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న తెలుగు నటి శృతి తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాపై సంచలన ఆరోపణలు చేసింది. ఏ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిల్లో ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు అన్యాయం జరిగితే చెప్పుకుని దిక్కు లేకుండా పోయిందని.. మాట్లాడితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని, లేదా మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో తెలియజేయాలంటున్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న శివాజీరాజా తనను మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడంటూ ఆరోపణలు చేసింది శృతి.శివాజీ రాజా నన్ను గతంలో హీరో శ్రీకాంత్‌కి పరిచయం చేస్తా.. దర్శకుడు కృష్ణవంశీకి పరిచయం చేస్తా అంటూ మభ్యపెట్టాడు. వేరే అమ్మాయిలను కూడా వాడుకున్నాడు. వాళ్లు కూడా బయటకు వచ్చి ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వాళ్లు పెద్దలుగా ఉన్న ‘మా’ ద్వారా మాకేం న్యాయం జరుగుతుందని మేం భావించడం లేదు’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది శృతి.ఇలాంటి వాళ్లని ‘మా’ ప్రెసెండెంట్‌ చేయడం కంటే టాలీవుడ్ టాప్ హీరోలుగా ఉన్న మెగాస్టార్, పవర్ స్టార్ లాంటి వాళ్లను ‘మా’ ప్రెసిడెంట్‌లుగా చేస్తే న్యాయం జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు శృతి.
Tags:The story of casting cowf …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *