Natyam ad

నెల్లూరులోని జిజిహెచ్ ఆసుపత్రి లో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం 

-గంటల్లోనే మిస్సింగ్ కేసును చేదించిన నెల్లూరు 4వ పట్టణ పోలీసులు

-బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

-నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి చెంతకు బిడ్డను చేర్చిన పోలీసులను శభాష్ అంటున్న జిల్లా ప్రజలు

Post Midle

-పిల్లలను కిడ్నాప్ చేసే మాఫియా నెల్లూరులో కూడా వేగంగా విస్తరిస్తోంది అనేదానికి ఈరోజు ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్ కేసు ఉదాహరణ,

నెల్లూరు నగర డిఎస్పి శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల మేరకు….

 

నెల్లూరు ముచ్చట్లు:

ఈరోజు ప్రభుత్వాసుపత్రిలో బాలుడు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి రాగానే బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు వేగంగా స్పందించిన నెల్లూరు నాలుగో పట్టణ పోలీసులు ఈ సమాచారం జిల్లా ఎస్పీకి తెలియపరచగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నగర్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి అందుబాటులో ఉన్న సిసి ఫుటేజ్ ల ఆధారంగా తల్లి చెప్పిన కొంత సమాచారం మేరకు ఆసుపత్రిలోని ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా తెలియడంతో అటు దిశగా కేసు దర్యాప్తు చేపట్టిన నాలుగో నగర సీఐ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి కొన్ని గంటల్లోనే బాలుడు ఉన్న చోటును కనుగొని కిడ్నాప్ కి సూత్రదారి అయిన మహిళను అదుపులోకి తీసుకుని బాలుడిని క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు… అనారోగ్యం పాలై నిస్సహాయ స్థితిలో ఉన్న కన్నతల్లి చెంతకు బిడ్డను చేర్చిన జిల్లా పోలీసులను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.

Tags: The story of the kidnapping of a four-year-old boy at GGH Hospital in Nellore has a happy ending

Post Midle