కథ కంచికేనా..?

Date :30/03/2020

సాలూరుముచ్చట్లు:

అంగన్‌వాడీల్లో చిన్నారుల అవసరాల నిమిత్తం అత్యాధునిక ఫైబర్‌ మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. దీనికోసం ఉపాధి పథకం నిధులతో పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పనులను పంచాయతీరాజ్‌శాఖ   ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. పైలట్‌ ప్రాజెక్టుగా కేవలం కొన్ని మండలాలనే ఎంపిక చేశారు. జిల్లాలోని సాలూరు మండలం కొత్తవలస పంచాయతీ జనవరివలస, పాచిపెంట మండలం పాంచాలి, తోటవలస, సీతానగరంలో గుచ్చిమి, గాదెలవలస, ఇప్పలవలస, కొమరాడ మండలంలో విక్రంపురం, చంద్రంపేట, కుమ్మరిగుంట అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్మాణాలను నిధులు మంజూరు చేశారు. ఎంపిక చేసిన మండలాల్లో ఒక్కో దానికి రూ.48 వేలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2019 మార్చి నెలలో పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఫైబర్‌ సామగ్రిని అన్ని మండలాలకు అందించారు. అయితే అప్పటి నుంచి కనీసం గోతులు కూడా తీయలేదు. ఎక్కడి సామగ్రిని అక్కడే వదిలేశారు. అనంతరం ఎన్నికలు జరిగగా.. అప్పటి నుంచీ ఈ ప్రాజెక్టు ఏమైందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రైవేటు ఏజెన్సీ పనులను ఎందుకు వదిలేసిందో ప్రస్తుతం అక్కడున్న అధికారులెవరికీ తెలియకపోవడం గమనార్హం.  ఫైబర్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసిన చోట్ల ప్రభుత్వం కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలను నిలిపి వేసింది. దీంతో అక్కడి చిన్నారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. రెండు మూడు చోట్ల మాత్రమే టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.సీతానగరం మండలంలో వీటిని చిన్నారులు వినియోగిస్తున్నారు. సాలూరు మండలం జనవరివలసలో ఇప్పటికీ అమర్చలేదు. పాచిపెంట మండలం తోటవలసలో ఏర్పాటు చేసినా నీరు అందుబాటులో లేకపోవడంతో బకెట్‌తో నీరు తీసుకువెళ్లి వినియోగిస్తున్నారు.

కరోనా పేరుతో దోపిడీ 

Tags: The story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *