గరుడసేవనాడు పనితీరుపైనే బ్రహ్మోత్సవాల విజయం ఆధారపడి ఉంటుంది
– ఓర్పు, అంకితభావంతో సేవలందించండి
– డెప్యుటేషన్ సిబ్బందికి ఈవో ఎవి.ధర్మారెడ్డి సూచన
తిరుమల ముచ్చట్లు:

గరుడసేవనాడు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎంత ఉత్తమంగా సేవలందించామనే అంశంపైనే తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల మొత్తం విజయం ఆధారపడి ఉంటుందని, కావున డెప్యుటేషన్ సిబ్బంది ఓర్పు, అంకితభావంతో సేవలందించాలని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమల రాంభగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం గరుడసేవ కోసం నాలుగు మాడ వీధుల్లో విధులు కేటాయించిన టిటిడి సీనియర్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఈవో మాట్లాడారు.తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ మాడ వీధుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రతి భక్తునికీ అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా చూడాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే, ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన సూచించారు.
అంతకుముందు జెఈవో వీరబ్రహ్మం శ్రీవారి సేవకుల సహకారంతో గ్యాలరీలలో భక్తులకు అన్నదానం, నీటి సరఫరా కార్యాచరణ ప్రణాళికపై కూలంకషంగా చర్చించారు.ఈ సమావేశంలో సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ బాలాజీ, సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర సీనియర్ అధికారులు, డెప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: The success of Brahmotsavam depends on the performance of Garudasevanadu
