మునిగిన ఆలయం

Date:12/09/2020

నిజామాబాద్  ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ మహారాష్ట్ర ప్రోజెక్టుల గేట్లు ఎత్తడం తో గోదావరి లోకి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది ఒడ్డున వెలసిన పురాతన ఆలయాలు నీటిలో మునిగిపోయాయి.ఇటీవల కందకుర్తి వద్ద త్రివేణి సంగమం శివాలయం నీటిలో మునిగిపోయింది.తాజా గా నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని ఉమా మహేశ్వరాలయం నీట మునిగింది.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం  88 టీఎంసి లకు చేరడం తో ఎగువకు నీటి ప్రవాహం పెరిగింది.దీంతో నది ఒడ్డున ఉన్న ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పుష్కర ఘాట్ పై నుంచి గోదావరి పరవళ్లు తొక్కుతోంది.ఒక సుందర దృశ్యాన్ని ఆవిష్కరించింది. నీటిలో మునిగి కేవలం ఆలయ గోపురం మాత్రమే దర్శనం ఇస్తోన్న ఈ ఆలయాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు..

 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సూచా తప్పక పాటిస్తున్నాం

Tags:The sunken temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *