ప్రజల ప్రాణాలతో చెలగాటం

-ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క కాటు మందు కొరత

Date:12/12/2019

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

నానాటికీ కుక్క కాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నా ఇటు ప్రభుత్వంలో కానీ… అటు సంబంధిత అధికారుల్లో కానీ ఎటువంటి చలనం లేదని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుత్రిలో కుక్క కాటు మందు అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులుడుతున్నట్టు పలువురు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా గురువారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, బాధితులతో కలిసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి సందర్శించారు. కుక్క కాటు మందు విషయమై ఆసుపత్రికి సిబ్బంది వివరాలు కోరగా సరిపడినంతగా  అందుబాటులో లేదని తెలిసింది. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్ర డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌కు డిమాండ్డుకు తగ్గట్టుగా కుక్క కాటు మందు, రేబిస్‌ మందు సరఫరా కావడం లేదని, దాని కారణంగా పేద ప్రజలు ఆవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి కుక్క కాటు కేసులు ఎక్కువ శాతం వస్తున్నాయని, అటువంటి ఆసుపత్రిలోనే ఈ మందుల కొరత ఉండడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, అలాగే అధికారుల అలసత్వంతో పాటు స్థానిక నాయకులు నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. తక్షణం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి కావాల్సినంత మేరకు సంబంధిత మందులు నిల్వ ఉంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే నగరంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కుక్కలను, అలాగే రేబిస్‌ లక్షణాలు ఉన్న కుక్కలను పట్టుకుని వాటిని వేరే ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణం ఈ చర్యలు చేపట్టాలని కోరారు.

 

వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి

 

Tags:The survivor of the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *