సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేయాలి…సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్

కడప ముచ్చట్లు:


విజయవాడ పట్టణంలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేయాలని సీపీఎం పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్  ఆదివారం నాడు కడపలో విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదన్నారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని కమీషనర్ ఇచ్చిన  ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.  ప్రజలు పన్నులు కట్టక పోవడానికి సిబ్బంది ఎలా బాధ్యులు అవుతారని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల మీద చెత్త పన్ను పేరుతో వేస్తున్న భారాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజానీకం కలుపుకొని పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.

 

Tags: The suspension of secretariat employees should be lifted…CPM Kadapa city secretary Ramamohan

Leave A Reply

Your email address will not be published.