తహసీల్దారు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కార్యక్రమం

The 'Swadeshi Andhra Pradesh' function under the leadership of the Tahsildar

The 'Swadeshi Andhra Pradesh' function under the leadership of the Tahsildar

రాజుపల్లి పంచాయతీ నందు చెత్త బట్టలను పంపిణీ చేసిన ప్రత్యేక అధికారి హేమలత  .

Date:02/10/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం లో మంగళవారం గాంధీ జయంతి ని పురస్కరించుకుని తహసీల్దారు సురేంద్రబాబు ఆద్వర్యం లో విఆర్వోలు,విఆర్ ఏ లు, సిబ్బంది కలిసి ‘ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దారు తో పాటు కార్యాలయ సిబ్బంది ఆవరణలో చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. తొలుత వారు తహసీల్దారు కార్యాలయంలోమహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అలాగే పెద్దవేలగటూరు గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి హేమలత గ్రామ పంచాయితీ కార్యాలయంలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజి సిద్ధాంతాలను ప్రజలందరూ పాటించి మంచి సమాజాన్ని నిర్మిచాలన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దవేలగటూరు గాంధీజీ జయంతి వేడుకల్లో విద్యార్థులు మంచి నైతికత అలవర్చుకోవాలి అని పిలుపునివ్వడం జరిగింది. గ్రామంలో మానవహారం నిర్వహించి గాంధీజీ విధానాలను తెలపడం జరిగింది.మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ రోజు గాంధీజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, రెడ్డమ్మ,సిఆర్పి రమేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పార్టీ నుంచి నన్నెందుకు సస్పెండ్ చేశారో ఇంతవరకు చెప్పలేదు!

Tags:The ‘Swadeshi Andhra Pradesh’ function under the leadership of the Tahsildar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *