అక్కరకు రాని స్వజల్ పధకం

వరంగల్ ముచ్చట్లు:


గుక్కెడు మంచినీటి కోసం ప్రయాణికులు ముప్పు తిప్పలు పడే పరిస్థితి. నీరు కావాలంటే వున్న రేటుకంటే ఎక్కువ మోతాదులో చెల్లించాల్సి వస్తోంది. బాటిల్‌ రూ.20 అయితే దానికి అదనంగా రూ.25 లేదా 30 చెల్లించి నీరు తాగే దుస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. పేద ప్రజల ప్రయాణ అవసరాలను తక్కువ ధరల్లోనే తీర్చే రైల్వేష్టేషన్లలో తిప్పలు తప్పడం లేదు. అయితే.. ప్రతి ప్లాట్‌ఫామ్‌పై తక్కువ ధరకే తాగునీరు అందించే ఐఆర్‌సీటీసీ ‘స్వజల్‌’ ఆర్‌వో ప్లాంట్‌లు మూతపడటం వల్ల జనం దాహార్తితో అలమటిస్తున్నారు. బయటి దుకాణాల్లో లీటరు నీళ్ల సీసాకు పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. స్వజల్‌ ప్లాంట్‌లో లీటర్‌ బాటిల్‌ ఐదు రూపాయలకే అందించేవారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలోనూ తాగునీరు కరవైంది.అయితే.. ఒక రైలులో 24 బోగీలుంటాయి, 12 వరకు స్లీపర్‌క్లాస్‌, 2 జనరల్‌ క్లాస్‌ మిగతావి ఏసీవి అన్నమాట. అంటే సామాన్య ప్రయాణికులే ఎక్కువ మంది రైలెక్కుతారు. స్టేషన్లలో సేవలు మాత్రం ప్రియమయ్యాయి. తిందామంటే తిండి దొరకదు.. దాహమేసినా నీరు దొరకని దుస్థితి. రైల్వే ఆధ్వర్యంలో ఐఆర్‌సీటీసీ నడిపించే ‘జనాహార్‌’ హోటళ్లు బంద్‌ అవడంతో ఫుడ్‌కోర్టులకు వెళ్లలేక.. ఆకలితోనే ప్రయాణించాల్సిన పరిస్థితి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పడింది. కరోనా కాలంలో మూతపడిన క్యాంటీన్లను తర్వాత తెరిచినా.. వాటి కాలపరిమితి అయిపోయిందంటూ కొన్ని స్టేషన్లలో మూతవేస్తే.. నగరంలోని సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లలో జనాహారమే దొరకని పరిస్థితి, ఒకప్పుడు అన్నిస్టేషన్లలో ప్రతి ప్లాట్‌ఫామ్‌ మీద ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో..

 

 

 

 

‘స్వజల్‌’ పేరిట ఆర్‌వో ప్లాంట్లుండేవి. అయితే.. కరోనా నేపథ్యంలో ఇవన్నీ మూతపడటంతో.. తర్వాత దీన్ని పట్టించుకునేవారే కరవయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో.. సికింద్రాబాద్‌ స్టేషన్‌ పేరుకే ఏ1 స్టేషన్‌గా గుర్తింపు పొందింది. కరోనా సాకుతో ‘జనాహార్‌’ క్యాంటిన్‌ బంద్‌ అయి మూడేళ్లయ్యింది. ఫుడ్‌ ట్రాక్‌ సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి. విజయవాడలోనూ స్టేషన్‌ అభివృద్ధి పనుల పేరుతో 6, 7 ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న క్యాంటీన్లను మూసేసారు. ఈస్ట్‌ కోస్టు పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జనాహార్‌ క్యాంటిన్‌ నడుస్తోంది. ఇందులో 20 రూపాయలకే జనతాఖానా దొరుకుతుంది. ప్రతి ప్రయాణికుడికి అందుబాటులో 20 రకాల ఆహారాలను అందిస్తున్నారు. ఇలాంటి వాతావరణం సికింద్రాబాద్‌ స్టేషన్లో ఎందుకు లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో.. రైల్వే అధికారులకు సామాన్య ప్రయాణికుల గోడు ఎందుకు పట్టడంలేదని, వ్యాపార ధోరణి తప్ప సేవామార్గం రైల్వేలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల విజయం , సుస్థిరత కోసం ”స్వజల్” పథకం ఫిబ్రవరి 2018లో బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ ఆరు రాష్ట్రాల్లో పైలట్ పథకంగా ప్రారంభించబడింది. 28 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 117 ఆకాంక్ష జిల్లాలకు ఈ పథకం విస్తరించబడింది. ఈ జిల్లాలు జాతీయ సగటు 44% నుండి పైప్డ్ వాటర్ సప్లై  నివాసాలలో 25% మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో స్వజల్ ద్వారా పీడబ్ల్యూఎస్‌ విస్తరణకు పెద్దపీట వేసింది. అయితే ఇప్పుడు ఈపథకం కనుమరుగైపోయింది. దీన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ విమర్శలు వస్తున్నాయి.

 

Tags: The Swajal scheme that did not come to that

Leave A Reply

Your email address will not be published.