అవిశ్వాసానికి నో చెప్పిన తమిళ పార్టీ

Date:19/17/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ప్రకటించింది అన్నాడీఎంకే. అవిశ్వాస తీర్మానం ఓటింగులో తాము పాల్గొనమని ఆ పార్టీ స్పష్టం చేసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు లోక్‌సభలో కూడా సంఖ్యపరంగా గట్టి బలమే ఉంది. ఈ పార్టీకి 37 మంది లోక్‌సభ ఎంపీలున్నారు. అన్నాడీఎంకే ఎన్డీయేలో భాగస్వామిగా లేదు. అటు యూపీఏలోనూ లేదు. తటస్థ పార్టీగా ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో, ఓటింగులో పాల్గొనేది లేదని ఇప్పుడు ఈ పార్టీ స్పష్టం చేసింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందనే అభిప్రాయాలను కలిగిస్తోంది. ఇది వరకూ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చినప్పుడు కూడా అన్నాడీఎంకే లోక్‌సభలో రచ్చ రేపింది. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో అప్పుడు అవిశ్వాస తీర్మానమే చర్చకు రాలేదు. తాము కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో ఆందోళన తెలుపుతున్నప్పుడు తమకు ఏ పార్టీ సహకారం అందించలేదని, అందుకే ఇప్పుడు తాము అవిశ్వాస తీర్మానంపై చర్చలో కానీ, ఓటింగులో కానీ పాల్గొనకూడదని నిర్ణయించినట్టుగా అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు.
అవిశ్వాసానికి నో చెప్పిన తమిళ పార్టీ https://www.telugumuchatlu.com/the-tamil-party-that-told-no-of-faith/
Tags:The Tamil party that told no of faith

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *