25 వేల గృహాల నిర్మాణం ప్రారంభమే లక్ష్యం

అనంతపురం  ముచ్చట్లు:
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25 వేల గృహాల నిర్మాణం పనులు లబ్ధిదారు లు చేపట్టే విధంగా లక్ష్యం వుంచుకు న్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొ న్నారు.అనంతపురం జిల్లా రాయ దుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న అగ్రికల్చర్ ల్యాబ్, రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు.అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు గృహాలను నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.జూలై 4వ తేదీ లోపు జిల్లావ్యాప్తంగా 25 వేల గృహాలు నిర్మాణం ప్రారంభం అయ్యే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలి పారు.జగనన్న కాలనీలో లబ్ధిదారుల గృహాలు నిర్మించుకునేందుకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. జగన్ ఇప్పటికే జగనన్న కాలనీల్లో బోర్లు, విద్యుత్ సౌకర్యం, నీటి ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. లబ్ధిదారులు ఏడాదిలోపు గృహ నిర్మాణం పూర్తి చేసుకుని ఆయా కాలనీల్లో స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కేవలం స్థలం కేటాయించడమే కాదు లబ్ధిదారులు గృహాలు నిర్మించుకొని సుఖసంతోషాలతో అందులో జీవిం చాలని ప్రభుత్వ కోరిక అని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ దగ్గర నుంచి గృహ ప్రవేశం చేసేంతవరకు లబ్ధిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:The target is to start construction of 25,000 houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *