తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి రెడ్ సాండర్ యాంటి-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు (Red Sanders Anti-Smuggling Task Force) ఇంచార్జ్ ఎస్పి ఎల్. సుబ్బరాయుడు ఐ.పి.యస్ వారి ఆదేశాల ప్రకారం తిరుపతి టాస్క్ ఫోర్సు యస్.పి పి. శ్రీనివాస్ వారి స్వీయ పర్యవేక్షణ లో ఎర్రచందనo అక్రమ రవాణ పై ప్రత్యక బృందాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచడమైనది. అందులో భాగముగా తిరుపతి RSASTF డి.యస్.పి చెంచుబాబు వారికి రాబడిన సమాచారము మేరకు కడప సబ్ కంట్రోల్, రిజర్వు ఇన్స్పెక్టర్ యం. చిరంజీవులు, ఆర్.యస్.ఐ మురళీధర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని అప్రమత్తo చేయడంతో, వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రొద్దుటూరు నుండి 01.08.2024 వ తేది బయలుదేరి శ్రీ సత్య సాయి జిల్లా, చెన్నే కొత్త పల్లి (CK పల్లి) మండలం, పుట్టపర్తి ఫారెస్ట్ డివిజన్, దామాజి పల్లి గ్రామము పరిసర ప్రాంతాలలో వాహనాలు తనికీ చేయడం మరియు పాత ఎర్రచందనం నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడమైనది. అందులో భాగంగా నిన్నటి దినము అనగా 02.08.2024 వ తేది ఉదయం 6.00 AM నుండి శ్రీ సత్య సాయి జిల్లా, చెన్నే కొత్త పల్లి (CK పల్లి) మండలం, పుట్టపర్తి ఫారెస్ట్ డివిజన్, పెనుకొండ రేంజ్ మరియు సెక్షన్, గుట్టూరు ఫారెస్ట్ బీటు పరిధిలో బెంగళూరు – హైదరాబాదు నేషనల్ హై వే రోడ్డు దామాజి పల్లి గ్రామమునకు సమీపమున ఆర్.యస్.ఐ మురళీధర్ రెడ్డి మరియు వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ వుండగా, ముందు వస్తున్న INNOVA వాహనము ఆపకుండ అతివేగముగా అక్కడి నుండి వెళ్ళిపోగా, దాని వెనకాల వస్తూవుండిన లగేజ్ వాహనమును కొద్ది దూరము లో ఆపి వాహనముల నుండి ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవుటకు ప్రయత్నము చేయగా, సదరు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని సదరు వాహనమును పరిశీలించగా అందులో వెనుక వైపున నల్లని పట్ట కప్పబడి వుండి, అందులో కొన్ని చెక్కబడిన ఎర్రచందనం దుంగలు లోడ్ చేయబడి వున్నవి. వాహనములో వున్న చెక్కబడిన ఎర్రచందనం దుంగలను క్రిందకు దించి లెక్కపెట్టగా మొత్తము 84 దుంగలుగా వున్నవి.
పై సంఘటన మీద ఆర్.యస్.ఐ మురళీధర్ రెడ్డి పిర్యాధు మేరకు RSASTF PS లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. సదరు కేసు దర్యాప్తులో కడప జిల్లాకు చెందిన పాత ఎర్రచందనం స్మగ్లర్లు ప్రమేయము ఉన్నట్లు తేలినది. అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఇచ్చిన నేర ఒప్పుదల మేరకు ఈ కేసులో సంబంధపడిన ఒక Innova కారును ప్రొద్దుటూరులో 03.08.2024 న స్వాదినము చేసుకోవడమైనది. ఈ కేసులో సంబందపడిన వారిపై లోతైన విచారణ జరుగుతున్నది. ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ లో అలవాటు పడిన నేరస్తులను గుర్తించి వారిపై ఉక్కు పాదం మోపే చర్యలో భాగంగా PD Act పెట్టి చట్ట పరంగా చర్యలు తీసుకోబడును.
పట్టుబడిన వ్యక్తుల వివరములు:
1) షేక్ హుస్సేన్ వల్లి, వయసు 24 సం. తండ్రి. మహబూబ్ బాష, D.No. 7/181, B.S. కాలని, గోపవరం పంచాయతి, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా,.
2) కాసెట్టి మల్లికార్జున, వయసు 37 సం. తండ్రి. కసెట్టి నాగన్న, మల్లెల గ్రామము, పంచాయతి మరియు పోస్ట్, తొoడూరు మండలం, కడప జిల్లా .
స్వాధీనము చేసుకొన్న వస్తువులు:
1. AP39UW4193 అను నంబరు గల Bolero కంపెనీకి చెందిన MAXX PIC UP లగేజ్ వాహనము.
2. AP21 AW 9051 అను నంబరు గల Toyota కంపెనీకి చెందిన INNOVA వాహనము.
3. 84 దుంగలు ( 2497 KGs).
వీటి విలువ వాహనములతో కలిపి సుమారు ఒక కోటి యాబై లక్షలు ఉంటుందని అంచనా. ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనపరిచిన డి.యస్.పి చెంచుబాబు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్.ఐ చిరంజీవులు, ఆర్.యస్.ఐ యం. మురళీధర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని ఇంచార్జ్ డి.ఐ.జి వారు అభినందించి, క్యాష్ రివార్డ్ ప్రకటించడమైనది.
Tags: The task force police seized the red sandalwood logs