ధర్మపోరాట దీక్ష కోసం టీడీపీ నేతలు ఫ్లైట్‌లో వెళ్లారు

The TDP leaders went for flight for Dharmaparata Initiation
 Date:11/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్ష కోసం టీడీపీ నేతలు ఫ్లైట్‌లో వెళ్లారు. ఈ విమానంలో బీజేపీ ఎంపీ ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలతో కలిసి ఆ ఎంపీ కూడా ఢిల్లీకి వెళ్లిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ-బీజేపీ రహస్య బంధం బయటపడిదంటూ ఎండగట్టారు. ‘పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?’ అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.  పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?అంతకముందు మరో ట్వీట్‌లో ‘ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు రూ.200కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదు.ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెట్టాడు.సొంత పనులకు హెలికాప్టర్,విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’అన్నారు.
Tags:The TDP leaders went for flight for Dharmaparata Initiation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *