.కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన టీపీసీసీ నేతల బృందం

Date:21/03/2018
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
గురువారం నాడు టీపీసీసీ నేతల బృందం ఎన్నికల కమిషనర్ ను కలిసింది. తమ శాసనసభ్యులు  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కూమార్ ల ఎమ్ ఎల్ ఎ పదవులను అనైతికంగా తొలగించారని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారని ఆరోపించింది. అసెంబ్లీ సెక్రటరీగా వున్న వ్యక్తి రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వ తొత్తుగా వ్యవహరించి, ఓటరు లిస్ట్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యే ల పేర్లు తొలగించారని ఫిర్యాదులో పేర్కోంది. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఇద్దరు ఎమ్మెల్యే ల పేర్లు చేర్చాలని సీఈసీ ని కోరింది. అసెంబ్లీ సెక్రటరీని  రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యతల నుంచి  తప్పించాలని ఈసీ ని కోరింది. బృందంలో  కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు వున్నారు.
Tags:The team of TEPC leaders met the Central Election Commission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *