మరియమ్మ లాకప్ డెత్ కు తెలంగాణ సర్కారు పూర్తి బాధ్యత వహించాలి            బీజేపీ నేత విజయశాంతి డిమాండ్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు కావడం తెలిసి ఎంతో బాధ కలిగించిందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ కేసులో పోలీసులు ఆమెను రాత్రి వేళ స్టేషన్‌కి తీసుకెళ్ళడమేగాక… ఒక మహిళను అదుపులోకి తీసుకున్నప్పుడు మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులే అమలు చెయ్యకపోవడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈ ఘటన జరిగిన ఆ పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం మన వ్యవస్థలు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నాయో అర్థమవుతోందన్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం రీపోస్ట్‌మార్టం చేయించి, తప్పుచేసినవారికి కఠిన శిక్షవిధించి తల్లిని కోల్పోయిన ఆ బాధిత కుటుంబానికి కొంతైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, దళితులు ఎన్నో విధాలుగా వెతలకు గురవుతున్నా… ఆ కేసులు సరైన సమయంలో పరిష్కారం కాకపోవడం, బాధితులు న్యాయం కోసం నిరీక్షిస్తూ ఉండటం జరుగుతోందన్నారు. ఏదేమైనా ఈ పరిణామాలకు తెలంగాణ సర్కారు పూర్తి బాధ్యత వహించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The Telangana government should take full responsibility for the death of Mariamma Lockup
BJP leader Vijayashanti demands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *