ఉష్ణోగ్రతలు ఆక్వా రంగాన్ని ఊపిరాడకుండా చేస్తోంది

Prices of risks in losses

Prices of risks in losses

Date:12/06/2019

నరసాపురం ముచ్చట్లు:

 

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్వా రంగాన్ని ఊపిరాడకుండా చేస్తోంది. అటు రొయ్యలతోపాటు ఇటు చేపల పెంపకం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. తెల్లమచ్చల వైరస్‌ వ్యాధితో సతమతమవుతున్న రొయ్యలకు తాజాగా వైట్‌ గట్‌ సమస్య మరింత వేధిస్తోంది. ఆక్సిజన్‌ లోటు తలెత్తిన చోట్ల అంతే వేగంగా వాటిని పట్టేస్తున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు తీరప్రాంత మండలాల్లో గుడ్లు తేలేసిన చేపలు తరచూ ఆకివీడు మార్కెట్‌లోకి తెచ్చి విక్రయించేస్తున్నారు. నియోజకవర్గంలోని ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసిన వనామీ రొయ్యల సంఖ్యను తగ్గించేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిక చోట్ల రొయ్యలను ‘మిడిల్‌ క్యాచ్‌’ (మధ్యలో పట్టడం) చేస్తున్నారు. ఇదే సమయంలో మేత తిన్నా ఆ స్థాయిలో వాటి ఎదుగుదల కన్పించడం లేదని పలువురు రైతులు చెబుతున్నారు. గత రెండు, మూడు నెలల నుంచి 50 నుంచి 110 కౌంటుకు చేరిన రొయ్యల ధరలను మార్కెట్‌లో తగ్గించేయడంతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు.

 

 

ఆక్వాలో అనధికార విస్తీర్ణం బాగా పెరుగుతోంది. చేపల చెరువుల పేరుతో పలువురు తక్కువ వ్యవధిలో పంటనిచ్చే రొయ్యల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. రొయ్య పిల్ల నుంచి మేతల వరకూ సరైన నాణ్యత కన్పించని పరిస్థితి నెలకొంది. రొయ్యల జీర్ణాశయంలో బ్యాక్టీరియా సోకి వైట్‌ గట్‌ సమస్య తలెత్తుతున్నట్లు ఆక్వా నిపుణులు వివరిస్తున్నారు. అదే సమయంలో మేత తినక అవి బాగా నీరసించి చనిపోతున్నాయని పేర్కొంటున్నారు. తెల్లమచ్చల వ్యాధి, వైట్‌ గట్‌ సమస్యల్లో ఏది తలెత్తినా కౌంటుతో సంబంధం లేకుండా హడావుడిగా పట్టడం చేస్తున్నారు. ఈ వ్యాధుల బారిన రొయ్యలను విక్రయించాలంటే మార్కెట్‌లో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గిరాకీకి మించి సరకు మార్కెట్‌లోకి వచ్చి పడుతుండటమే ధర తగ్గిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

 

 

 

గత 20 రోజుల నుంచి పగటి పూట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిణామం చేప, రొయ్యల చెరువుల్లోని నీటి ఉష్ణోగ్రతల్లో మార్పులకు దారితీస్తోంది. అధికచోట్ల చెరువుల్లో నీటిమట్టాలు తగ్గిపోయి నీరు చిక్కబడిపోతోంది. అటువంటి చోట్ల చేప, రొయ్యల పెరుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. చెరువునీటి గుణగణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకొని ప్రాణవాయువు శాతం పడిపోవచ్ఛు ఆక్సిజన్‌ లోటు తలెత్తకుండా ఏరియేటర్లను నిరంతరం తిరిగేలా జాగ్రత్తలు పాటించాలి. చేపల చెరువుల్లో మేత వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. జియోలైట్‌, కాల్షియం పెరాక్సైడ్‌ వంటి రసాయనాలు వినియోగిస్తే చేపకు కొంతవరకూ ఉపశమనం లభిస్తుంది. చేపల చెరువుల్లో నీటిని రీసైక్లింగ్‌ చేస్తుండాలి.

ప్రజల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు

Tags:The temperatures are making the aqua seamless

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *