Date:06/11/2020
వరంగల్ ముచ్చట్లు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ఉత్తర తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ వీరభద్ర స్వామి దెవస్థానం ఆలయ ప్రాంగణం లోని కల్యాణకట్ట పక్కన కళ్యాణ మండపం కోసం నిర్మించిన గది నిరుపయోగంగా ఉండడం తో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది . విచ్చలవిడిగా మందుబాబాలు మద్యం తాగి మద్యం బాటిళ్లు ఆలయ ఆవరణలో పడవేసి వెళుతున్న పట్టించు కొనే అధికారులు లేరు. ఈ విషయాన్ని స్థానికులు ఆలయ ఈఓ సులోచన దృష్టికి పలుసార్లు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని వారి ఆరోపణ. పవిత్ర పుణ్యక్షేత్రం లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అధికారులు పట్టించు కొకపోవడం తో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:The temple is adjacent to Mandubabu