ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

Date:02/07/2019

 

విశాఖపట్నం ముచ్చట్లు:

సోమవారానికి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ బెంగాల్‌, ఒడిసాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది.ఇది మరింత బలపడి పశ్చిమంగా పయనించి మంగళవారానికి వాయుగుండంగా మారనుంది.దీని ప్రభావంతో ఒడిసా, కోస్తా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు కురిశాయి.తీవ్ర అల్పపీడనంగా మారే క్రమంలో రానున్న 24గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి.కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.తీవ్ర అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి సూచించారు.కాగా, తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా మారి పడమర దిశగా పయనిస్తుందని, దీంతో రానున్న రెండురోజుల్లో మధ్య భారతం దానికి ఆనుకుని అనేక రాష్ట్రాల్లో భారీనుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

కుప్పంలో నేడు,రేపు పర్యటించనున్నచంద్రబాబు

Tags:The tension in the northern Bay of Bengal has strengthened.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *