రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాలి

– పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్

Date:15/09/2020

హైద‌రాబాద్‌  ముచ్చట్లు:

పాకిస్థాన్‌లోని లాహోర్ హైవేపై ఇటీవ‌ల ఓ మ‌హిళ‌ను అత్యంత క్రూరంగా రేప్ చేశారు.  ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మ‌‌హిళ‌ను ఇద్ద‌రు గ‌న్‌ తో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో పెను సంచ‌ల‌నం రేపింది.  యావ‌త్ దేశం ఆ ఘ‌ట‌న ప‌ట్ల షాక్‌ వ్య‌క్తం చేసింది. నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయాల‌ని డిమాండ్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌న్నారు. లేదంటే  ర‌సాయ‌నిక ప‌ద్ధ‌తిలో రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాల‌ని సూచించారు.
వాస్త‌వానికి బ‌హిరంగంగా ఉరి తీయాల‌ని ఆదేశం ఉన్నా.. పాకిస్థాన్ ఆ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, ఎందుకంటే అలా చేస్తే యూరోపియ‌న్ యూనియ‌న్ త‌మ వాణిజ్య సంబంధాల‌ను తెంచుకుంటుంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కెమిక‌ల్ క్యాస్ట్రేష‌న్ ప‌ద్ధ‌తికి తాను మెగ్గుచూపుతున్న‌ట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. హ‌త్య‌ల్లో ఫ‌స్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్న‌ట్లే.. రేప్‌కు పాల్ప‌డిన వారికి ఫ‌స్ట్ డిగ్రీలో భాగంగా వారి వృష‌ణాల‌ను తొల‌గించాల‌న్న సూచ‌న చేశారు.  ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇమ్రాన్ ఈ కామెంట్ చేశారు. అయితే హైవేపై జ‌రిగిన రేప్‌కు సంబంధించిన నిందితుల‌ను అరెస్టు చేశారు.

విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రింత స‌మ‌యం

Tags: The testicles of the rapist should be kept out of action

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *