చిన్నారికి మూడో కన్ను…యుగాంతమేనా

Date:15/07/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న వీడియోను మీరూ చూసే ఉంటారు. పోతులూరి వీర బ్రహ్మంగారు చెప్పినట్లే ఓ చిన్నారి మూడు కళ్లతో పుట్టిందంటూ ఈ వీడియోను ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకుంది. బ్రహ్మంగారు చెబుతున్నవి అన్నీ జరుగుతున్నాయని, ఇక యుగాంతం రావడం ఒక్కటే ఆలస్యమని అంతా అంటున్నారు.  చిన్నారికి నుదిటి మీద అదనంగా మూడో కన్ను ఉంది. దీన్ని కాస్త పరిశీలనగా చూస్తే.. ఎడమ కంటికి నకిలీలా ఉంది. నిపుణుల పరిశీలన ప్రకారం.. కొందరు ఎడమ కంటిని కాపీ చేసి చిన్నారి నుదిటి వద్ద పెట్టినట్లు తెలుస్తోంది. పైగా, ఈ వీడియో నిడివి చాలా తక్కువగా ఉండటం వల్ల ఎడిటింగ్ సులభతరమైందని అంటున్నారు. ఈ వీడియో ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. కొందరు దీన్ని ఫేక్ అని కొట్టి పడేస్తుంటే మరికొందరు నిజమేనని అంటున్నారు. ‘కార్నియో ఫేసియల్ డూప్లికేషన్’ లేదా ‘ ఫేసియల్ డూప్లికేషన్’ వల్ల ఇలాంటివి ఏర్పడతాయని అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగులోనే ఎక్కువ వైరల్ అవుతోంది. దొరికిందే సందుగా యూట్యూబ్ చానెళ్లు.. ఈ వీడియోను తెగా వాడేస్తున్నాయి. వారికి తోచిన కథను అల్లేస్తూ జనాలను భయపెట్టే పనిలో పడ్డాయి.

 

హెచ్‌ఎండిఏ లే ఔట్ల అనుమతుల్లో కొత్త మార్గదర్శకాలు

Tags:The third eye of the child … Is it eternal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *