గులాబీ బాస్ ఎందుకిలా భయంతో కూడిన బెదిరింపు

Date:27/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో నాయ‌కుల వ్యాఖ్య‌ల‌పై అనేక ముచ్చ‌ట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌, ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ విష‌యంపై చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన‌ప్పుడు ఉన్న ధీమా.. ఇప్పు డు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు. నిజానికి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. అధికార పార్టీలో జోష్ పెర‌గాలి. తాము గెలుస్తామ‌నే ధీమా మ‌రింత‌గా విని పించాలి. అయితే, ఇప్పుడు ఆ ధీమా క‌నిపించ‌డం లేదు. పైగా.. త‌మ‌కు ఓటు వేయ‌క‌పోతే.. న‌ష్ట‌పోయేది మీరే!! అంటూ.. బెదిరింపు వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం మ‌రింత విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. వాస్తవానికి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తూ.. గ‌వ‌ర్న‌ర్‌కు రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన అనంత‌రం నిర్వ‌హించిన మీడియా మీటింగ్‌లో కేసీఆర్ ముఖంలో ఆనందం స్ప‌ష్టంగా క‌నిపించింది.త‌మ‌దే గెలుప‌ని, త‌మ‌కు తిరుగులేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు, త‌మ‌కు 100 కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు.
అయితే, ఎన్నిక‌లు మ‌రో 15 రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో ఇప్పుడు ఇటు కేసీఆర్ మాటల్లోనూ, ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీఆర్ మాట్లోనూ ఒకింత భ‌యంతో కూడిన బెదిరింపు ధోర‌ణి క‌నిపిస్తుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. వాస్త‌వానికి ప్ర‌చారానికి వెళ్లిన ప్ర‌తి చోటా గెలుస్తామ‌ని చెబుతూనే టీఆర్ఎస్ ఓడిపోతే త‌న‌కేమీ న‌ష్టం లేద‌ని.. ఇంట్లో ప‌డుకుని రెస్ట్ తీసుకుంటామ‌ని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ బ‌హిరంగ స‌భ‌లోని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఏకంగా టీఆర్ఎస్ నేత‌ల‌ను కూడా విస్మ‌యానికి గురిచేశాయి. అంటే ప్ర‌జ‌లు త‌మను మాత్ర‌మే గెలిపించాల‌ని., అప్పుడే వారి జీవితాలు బాగుంటాయ‌నే ధోర‌ణిలో కేసీఆర్ వ్యాఖ్యానించారా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇక‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ కూడా ఇలానే వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ లో మాట్లాడిన మంత్రి కెటీఆర్ కూడా తాము గెల‌వ‌క‌పోతే…ఎవ‌రికీ క‌న‌ప‌డం..విన‌ప‌డం అని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలో ఉంటే క‌న్పిస్తాం..లేదంటే లేదు అనే త‌ర‌హాలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌.. త‌న ఓట‌మ‌ని ఊహిస్తున్నార‌నే విష‌యం లీలగా క‌నిపిస్తోంద‌ని, అందుకే ఆయ‌న ఏకంగా ప్ర‌జ‌ల‌నే బెదిరించే ధోర‌ణికి వ‌స్తున్నార‌ని అంటున్నారు.రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు మేలు చేస్తార‌ని భావిస్తే. వారికి ఓట్లు వేయ‌డం, అధికారం అప్పించ‌డం కూడా స‌హ‌జ‌మే. కానీ, కేసీఆర్ మాత్రం త‌మ‌కు మాత్ర‌మే ఓటు వేయాల‌ని లేకుంటే మీ ఖ‌ర్మ‌! అనే విధంగా హెచ్చ‌రిక‌ల‌తో కూడిన వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న పెద్ద‌త‌నాన్ని చిన్న బుచ్చ‌కున్న‌ట్టుగానే ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు రాజ‌కీయాల్లో జ‌యాప‌జాయాల‌ను స‌మ‌తూకంతో చూడాల్సిన అవ‌స‌రం కేసీఆర్‌కు ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి తెలంగాణా ఉద్య‌మ సార‌ధి ఎందుకు ఇంత అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:The threat of a pink bounce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *