ముంచుకొస్తున్న తిత్లీ తుపాను

The thrilling storm

The thrilling storm

గురువారం ఉదయానికి గోపాల్‌పూర్‌- కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
 తీర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
Date:10/10/2018
భువనేశ్వర్‌  ముచ్చట్లు:
ముంచుకొస్తున్న తిత్లీ తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తుపాను బుదవారం  మధ్యాహ్నానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా-ఆంధ్రా వైపు చురుగ్గా కదులుతోందని.. గురువారం ఉదయానికి గోపాల్‌పూర్‌- ఏపీలోని కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ సమయంలో భారీ వర్షాలతో పాటు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
ఇప్పటికే బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండడం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.ముంచుకొస్తున్న తిత్లీ తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పూరీ, గంజామ్‌, గజపతి, జగత్‌సింగ్‌పూర్‌లోని విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. భువనేశ్వర్‌లోని ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌(ఎస్‌ఆర్‌సీ) కార్యాలయం పరిస్థితిపై నిఘా సారించింది.
తీర ప్రాంతాల్లోని 889 ఆశ్రయ స్థలాల్లో ఆహారసామగ్రి, మందులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, ఇతర అత్యవసర సామగ్రి సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎస్‌ఆర్‌సీ ప్రభాత్‌ మహాపాత్ర్‌ మంగళవారం విలేకరులకు చెప్పారు. భారీ వర్షాలు కురవనున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే 300 మోటారు పడవలు సిద్ధం చేశామని తెలిపారు. తుపాను తీవ్రతపై ఎప్పటికప్పుడు అధ్యయనం జరుగుతోందని.. దీనిపై ఐఎండీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సహాయక చర్యలు అందించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ముందస్తుగా కొన్నిచోట్ల నియమించామని తెలిపారు.
Tags:The thrilling storm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *