చెక్కర కర్మాగారాన్ని వెంటనే తెరిపించాలి

రైతులకు మద్దతుగా ఈనెల 9, 10, 11న  మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి

కోరుట్ల  ముచ్చట్లు :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోనే రైతు ఆధారిత కర్మాగారం చెక్కర కర్మాగారం గెలిచిన 100 రోజుల్లో ఫ్యాక్టరీ  తెరిపిస్తామని హామీ ఇచ్చి గెలిచినక పూర్తిస్థాయిలో మూసి వేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి ఆన్నారు.మంగళవారం మెట్ పెల్లి పట్టణంలోని వారి నివాసంలో విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా జరిగిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోనే రైతు ఆధారిత కర్మాగారం చెక్కర కర్మాగారం గెలిచిన 100 రోజుల్లో ఫ్యాక్టరీ  తెరిపిస్తామని హామీ ఇచ్చి గెలిచినక పూర్తిస్థాయిలో మూసివేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కింది ఆన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తా అని హామీ ఇచ్చి కలం గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు ఆన్నారు.
గత కొద్దిరోజులుగా కోరుట్ల నియోజకవర్గానికి వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు వాస్తు పోతున్నారే తప్ప ఇచ్చిన హామీల మీద సోయి లేకపోవడం చాలబదాకరం అందుకే రైతుల పక్షణ కాంగ్రెస్ పార్టీ శాంతి యూతంగా నిరసన దీక్ష కార్యక్రమాలు ఈ నెల 9,10,11 న మూడు రోజులు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు .ఇప్పటికైనా రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని వెంటనే తెరిపించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దీన్ పాషా ,కాంగ్రెస్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ తర్రీ రాజారాం, కోరుట్ల మాజీ పట్టణ అధ్యక్షులు ఏ ఆర్ అక్బర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అగ బాలయ్య, గుండ నరసింహులు గుండ రాజన్న ,అజార్ ,రాజారెడ్డి ,కాశన్న కృష్ణమూర్తి, అరుణ్ ,అశోక్ ,ఇతర కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The timber factory should be opened immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *