Natyam ad

టైరు పేలి బస్సు దగ్దం..ప్రయాణికులు సురక్షితం

నల్గోండ ముచ్చట్లు:


నల్లగొండ జిల్లా చిట్యాల మండలం , పెద్ద కాపర్తి వద్ద పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. టైరు పేలడంతో బస్సు దగ్దం అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్  అప్రమత్తమైయాడు. వేంటనే ప్రయాణికులను బస్సు నుంచి దించడంతో.. అంతా సేఫ్ అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులున్నారు. ఫైరింజన్ సహాయంతో మంటలనుఅదుపులోకి తెచ్చే యత్నం చేశారు. అప్పటికే బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. కాగా.. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన చోటచేసుకుంది. ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Tags: The tire exploded and the bus caught fire..passengers are safe

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.