అశోక్‌ గల్లా హీరోగా, శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న సినిమా టైటిల్‌ టీజర్‌ ఈ నెల 23న విడుదల.

సినిమా ముచ్చట్లు:

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని  అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ  అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అశోక్‌ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయగ్రాహకులుగా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్‌ రావిపాటి ఈ  చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: అశోక్‌ గల్లా, నిధీ అగర్వాల్, జగపతిబాబు, నరేష్, కౌశల్యా, వెన్నెల కిశోర్, సత్య, మైమ్‌ గోపి, అర్చన సౌందర్య, అజయ్‌ ప్రభాకర్‌…

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:The title teaser of the movie directed by Sriram Aditya with Ashok as Galla Hero will be released on the 23rd of this month.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *