ఇజ్రాయిల్ దాడులలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ మృతి
న్యూ డిల్లీ ముచ్చట్లు:
గాజా వద్ద ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో 10 మంది మరణించారు. దాంట్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూపునకు చెందిన టాప్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు ఇచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు ప్రధాని యాయిర్ లాపిద్ తెలిపారు. తొలుత ఇజ్రాయిల్‌పై పీఐజే సుమారు వంద రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన ఐరన్ డోమ్ ఆ క్షిపణులను అడ్డుకున్నది. ఇజ్రాయిల్‌లోని అనేక పట్టణాల్లో సైరన్లు మోగాయి.పాలస్తీనా మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా.. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం దాడుల్ని ప్రారంభించింది. వివిధ మిలిటెంట్ల స్థావరాలను టార్గెట్ చేశారు. పీఐజేతో లింకు ఉన్న సైట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.గాజా సిటీలో ఉన్న బహుళ అంతస్తుల పాలస్తీనా టవర్‌ను కూడా పేల్చేశారు. ఆ బిల్డింగ్ నుంచి భారీ స్థాయిలో పొగ వస్తోంది. పీఐజే నేత తయిసిర్ జబారీతో పాటు మరో ముగ్గురు మిలిటెంట్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 55 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
Tags: The top commander of a Palestinian militant group was killed in Israeli attacks

