Telangana Nam Ke Vast .. Tests

జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 19.

-మదనపల్లి, చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో కరోనా పాజి టివ్ కేసులు వస్తే చిత్తూరు లోని జిల్లా కోవిడ్ ఆసు పత్రికి తరలిస్తాం.

-జిల్లాలో తొలి కరోనా బాధితుడు డిశ్చార్జ్…14 రోజులు స్వీయ నియం త్రణ పాటించాలని తెలిపిన వైద్యులు.

-మన డాక్టర్ల సమిష్టి విజయం.

-ప్రజలు ఆందోళన చెంద వద్దు. భౌతిక దూరం పాటి ద్దాం… కరోనా కట్టడికి కృషి చేద్దాం : జిల్లా కలెక్టర్

Date:09/04/2020

చిత్తూరు ముచ్చట్లు :

 

మదనపల్లి,చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో కరోనా పాజి టివ్ కేసులు వస్తే చిత్తూరు లోని జిల్లా కోవిడ్ ఆసు పత్రికి తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండు కోవిడ్ ఆసుపత్రులు కలవని, ఇందులో తిరుపతిలో పద్మావతి మెడికల్ మహిళా వైధ్య కళాశాల రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా కలదని, చిత్తూరు లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా మార్చి కరోనా పాజిటివ్ కేసులు మదనపల్లి, చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిసర ప్రాంతాలలో నమోదైన వారిని ఇక్కడికి తరించడం జరుగుతుందని, వీలైనంత ప్రయాణ దూరం తగ్గించేం దుకు నిర్ణయం తీసుకున్నా మని తెలిపారు.

 

 

పాజిటివ్ కేసులు ఉన్న వారి కేసు తీవ్ర త,మరియు ఆరోగ్య స్థితి గతులను బట్టి కేసులను జిల్లా కోవిడ్ ఆసుపత్రికి లేదా రాష్ట్ర కోవిడ్ ఆసుప త్రికి తరలించడం జరుగు చున్నదని తెలిపారు.జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లో 210 పడకలు, ఐ.సి.యు. నందు 20 పడకలు ముందస్తుగా వైధ్య సేవలు అందించుటలో భాగంగా ఏర్పాటు చేయదమైనదని, నగిరిలో పాజిటివ్ గా వచ్చిన రెండు కేసులను జిల్లా కోవిడ్ ఆసుపత్రి నందు ఉంచి చికిత్స అందించడం జరుగుచున్నదని తెలిపారు. ఇక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరి రక్షణకు జిల్లా యంత్రాంగం వారికి అవసరమైన మాస్కులు, పి.పి.యు కిట్ లు, శ్యానిటైజర్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

 

 

 

జిల్లాలో శ్రీకాళహస్తిలో నమోదైన తొలి కరోనా బాధితుడికి నెగటివ్ గా రిపోర్ట్ రావడం తో గురువారం డిశ్చార్జ్ కావడం జరిగిందని, డిశ్చార్జ్ అయిన తరువాత కూడా 14 రోజులు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు తెలపడం జరిగిందని, ఇది మన డాక్టర్ల సమిష్టి విజయమని అభినందించారు.. ప్రజలు కరోనా కట్టడికి సహకరిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని సామాజిక బాద్యతగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు.

మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులకు పెరిగిన గిరాకీ

Tags: The total number of positive cases so far in the district is 19.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *