మూడో రోజుకు చేరుకున్న పట్టణ ప్రగతి

Date;27/02/2020

మూడో రోజుకు చేరుకున్న పట్టణ ప్రగతి

సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

 

సూర్యాపేటముచ్చట్లు:

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మురంగా సాగుతోంది. అభివృద్ధి ప్రణాళిక పేరుతో పల్లెల ప్రగతిని పోటాపోటీగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పట్టణ ప్రగతి పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే.దానికి తోడు పట్టణ
ప్రగతిలో మొదటి ప్రాధాన్యత అంశాలుగా పర్యావరణం,డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు తో పాటు శ్మశాన వాటికల నిర్వహణకు పెద్ద పీట వేయడం తో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సూర్యపేట పట్టణంలో రెండవ వార్డులో ఈనెల 24 న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించిన పట్టణ ప్రగతికార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపద్యంలో నే జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లను సమన్వయం చేస్తూ పట్టణప్రగతి కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తోన్న మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ఉదయం సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 33వార్డులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేవలం ఆకస్మిక తనిఖీలతో కాకుండా కాలనీలు మొత్తం కలియ తిరుగుతూ జరిపిన ఆకస్మిక తనిఖీలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేంద్ర బిందువుగా మార్చింది.అన్యుహంగా మంత్రి జగదీష్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కాలనీ వాసులు అవాక్కయ్యారు. అనుకోని పరిణామం నుండి కొలుకునేందుకు పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టిన అధికార యంత్రాంగం అయోమయంలో పడిపోయారు.అనంతరం పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు గాను హాజరైన స్థానికులనుద్దేశించి మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో పర్యావరణానికి ప్రాధాన్యత కల్పించాలి. ప్రతి ఇంటిలో 30% నికి పై బడి మొక్కలు నాటాలి. ఇంట్లో స్థలం లేనివారు రూప్ గార్డెన్ లపై దృష్టి సారించాలి అందుకు ఆర్థిక సహాయం చేసేందుకు పురపాలక సంఘం సిద్దంగా ఉందని అన్నారు.  పురపాలికల్లో 10 శాతానికి పై బడి నిధులు పచ్చదనానికి కేటాయించామని అన్నారు. మొక్కలు పెంపకంలో 85 శాతానికి పై చిలుకు బతికేల శ్రద్ధ చూపాలి  75 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటే అనుమతులు అక్కరలేదు. పారిశుద్ధ్య నిర్వహణ లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న పర్యావరణ సమస్యను అధిగమించాలి. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమ శ్లాఘనీయమని అన్నారు.   హరితహారం అందులో భాగమే  అటు పల్లె ప్రగతిలో ఇటు పట్టణ ప్రగతిలోనూ పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వడం అందులో భాగమే అదే సమయంలో చెత్త సమస్య మానవాళికి సవాల్ విసురుతోంది. చెత్త నుండి మురికి కుంటలనుండి పుట్టిన చిన్న దోమ ప్రాణాంతకంగా మారుతోంది. డంపింగ్ యార్డ్ ల ఏర్పాటు అందులో భాగమే  తడి చెత్త పొడిచెత్త లను వేరు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. పారిశ్యుద్యం పై ప్రణాళికలు రూపొందించి అందులో ప్రజలను భాగస్వామ్యం చెయ్యాలని మంత్రి అన్నారు

Tags;The town progresses to the third day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *