కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల  సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు  అందజేయాలి

– జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్

Date:09/05/2020

కడప ముచ్చట్లు:

తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుంచి లారీలలో పండ్లు, కూరగాయలు తీసుకొని జిల్లాకు వచ్చిన హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు, పండ్లు కూరగాయలు లారీలలో నింపడం మరియు దించడం చేసే హమాలీ కూలీలు ఎవరైనా వస్తే వెంటనే జిల్లాలోని  కంట్రోల్ రూమ్ నెంబర్  08562- 245259, 259179 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా మెడికల్ కాలేజీకి గాని లేదా జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరుకు వచ్చి కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. లేదా వారికి అందుబాటులో గాని, దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ ను సంప్రదించాలన్నారు. వ్యాపారం నిమిత్తం వచ్చే వారికి పక్క జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయని, దీని దృష్ట్యా కోయంబేడు నుంచి కడపకు,  కడప నుంచి కోయంబేడుకు వ్యాపార నిమిత్తం వెళ్లి వచ్చే హోల్సేల్, రిటైల్, హమాలీలు అందరూ తప్పనిసరిగా ఈ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంఐఎం ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి

Tags: The traders coming from Coimbatore should be provided with the control room

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *