వినోదం వెనుక ఎంతో విషాదం

Date:19/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సినిమాలోని హాస్య నటులు మనల్ని కడుపుబ్బా నివ్విస్తారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. బోలెడన్ని సినిమాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారులే అని మనం అనుకుంటాం. కానీ చాలా మంది హాస్యనటుల నిజ జీవితంలో ఎంతో విషాదం దాగి ఉంటుంది. తొలి నాళ్లలో వెండితెరపై ఓ వెలుగు వెలిగి.. కెరీర్ ముగుస్తున్న తరుణంలో దుర్భర జీవితాన్ని అనుభవించిన హాస్యనటులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి కోవలోకే గుండు హనుమంతరావు కూడా చేరారు. 200కి పైగా సినిమాలు చేసిన ఓ హాస్యనటుడు వైద్యానికి డబ్బులు లేక, ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయిన పరిస్థితిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నా.. ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ విషయాలను ఎప్పుడూ ఎవరికీ గుండు హనుమంతరావు చెప్పలేదు. అయితే ఓ ప్రముఖ ఛానెల్‌లో అలీ నిర్వహించే షో ద్వారా గుండు తన పరిస్థితిని బయటపెట్టారు. ఇప్పటి వరకు తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు. పాతికేళ్లకుపైగా తన కెరీర్‌లో సంపాదించుకున్న కోట్ల రూపాయలు కరిగిపోయిన వైనాన్ని.. భార్య, కూతురు మరణాలను తట్టుకోలేకపోవడాన్ని అలీకి వివరించారు. వరుస దుర్ఘటనలతో మానసికంగా కుంగిపోవడమే కాకుండా కిడ్నీలు సైతం దెబ్బతిన్న రహస్యాన్ని హనుమంతురావు వెల్లడించారు. ఈ షో తరవాతే తెలంగాణ ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు గుండు హనుమంతరావుకు మంజూరు చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైతం రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.గుండు హనుమంతరావు దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల కింద కూతురు చనిపోయింది. ఆమె చనిపోయిన రెండేళ్ల తర్వాత భార్య కూడా కన్నుమూశారు. అప్పటికే తన కుమారుడు అమెరికాలో చదువున్నారు. కొడుకు చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. భార్య, కూతురు చనిపోవడంతో హనుమంతరావును చూసుకోవడానికి ఆయన కొడుకు ఇక్కడకు వచ్చేశారు. అయితే ఇక్కడ ఆయనకు ఉద్యోగం ఏదీ దొరకలేదని తెలుస్తోంది. దీంతో ఇద్దరి భారం హనుమంతరావు సంపాదన మీదే పడిందట. హనుమంతరావుకు బైపాస్ సర్జరీ అయ్యింది. అది జరిగిన సమయంలో కిడ్నీలో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.తన వైద్యానికి సంవత్సరానికి రూ.6 లక్షలు ఖర్చయ్యేదని అలీ ఇంటర్వ్యూలో గుండు హనుమంతరావు చెప్పారు. ‘మా’ నుంచి ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షలు అందేదని, మిగిలిన రూ.4 లక్షల కోసం తాను కష్టపడేవాడినని వెల్లడించారు. చేతిలో సినిమాలు లేని సమయంలో ఇంత మొత్తం తనకు చాలా భారంగా మారిందని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తండ్రీ కొడుకులు ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఇప్పుడు హనుమంతరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కొడుకు ఒంటరి అయిపోయారు.రైల్వేల తీరు మారుతుందా అని ఎదురుచూస్తోన్న ప్రయాణీకులకు అది సుదూర స్వప్నమేనని మరోసారి రుజువైంది. సామాజిక మాధ్యమాల్లో చైతన్యం వచ్చిన తరువాత కొంత మారుతుందని భావించినా? అదంతా భ్రమేనని ఈ ఘటన రుజువుచేసింది. ఆహారం, మంచి నీళ్లు, టాయిలెట్లు బాగాలేవని ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తే, రైల్వే మంత్రి నుంచి అధికారుల వరకూ వెంటనే స్పందించి, ప్రయాణికుల అవసరాలు తీర్చి వార్తల్లోకి వచ్చింది. దీంతో రైల్వేలు మారాయని భావించారు. అదే ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని గంటల తరబడి మొత్తుకున్నా స్పందించలేదు, సరికదా చిన్నారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు.ఈ ఘటన గత రాత్రి యశ్వంత్ పూర్- గరీభ్‌రథ్‌లో చోటుచేసుకుంది. గరీభ్‌రథ్ రైలు జీ5 కోచ్‌లో ఓ జంట తన చిన్నారితో కలసి ప్రయాణిస్తున్నారు. ఆ చిట్టితల్లి గుండె సమస్యతో బాధపడుతోంది. పాప నాడి ఆగిపోయినట్టు గమనించిన తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్నవారికి సమాచారం ఇచ్చారు. ఈ పరిస్థితిని గమనించిన రైల్లో ప్రయాణీస్తోన్న సన్నీ దినకర్ అనే యువకుడు.. రైల్వే మంత్రి పీయుష్ గోయల్, ఆయన కార్యాలయం, ప్రధాని కార్యాలయం, రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయం, ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ పాపను కాపాడాలని పలుమార్లు వేడుకున్నాడు. రైలు కాసేపట్లో వైజాగ్ కు చేరుకుంటుందని, వైద్య బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశాడు. ఇంతలో రైలు వైజాగ్ చేరిన తరువాత కూడా వైద్యులను పంపాలని కోరాడు. అయినా సరే స్పందించకపోవడంతో చివరికి పాప ఈ లోకాన్ని విడిచింది. తాను ట్యాగ్ చేసినవారిలో ఏ ఒక్కరు స్పందించినా, పాప ప్రాణాలు దక్కేవని సన్నీ వ్యాఖ్యానించగా, అధికారుల వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువకుడి ట్వీట్‌కు స్పందించిన విజయవాడ డీఆర్ఎం కార్యాలయం.. ఈ విషయం గురించి సంబంధిత ఆధికారులకు తెలిపినట్లు రిప్లై ఇచ్చింది.
Tags: The tragedy behind entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *