విషాదాన్ని మిగిల్చిన శ్రీలంకలో ఉగ్రదాడి

The tragedy of the terrorists in Sri Lanka has survived.
Date:22/04/2019
కొలంబో ముచ్చట్లు:
పవిత్రమైన ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన హింసాకాండ తీరని విషాదం మిగిల్చింది. వందలాది కుటుంబాల్లో చీకటి నింపింది. ఆదివారం (ఏప్రిల్ 21) కొలంబోలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో ఇప్పటివరకూ 300 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. పేలుళ్లలో 500 మంది వరకు గాయపడ్డారు. మరెంతో మంది ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శ్రీలంక బాంబు పేలుళ్లకు సంబంధించిన విషాద ఇతివృత్తాంతాలు ఒక్కోటీ వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్‌లో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం విహార యాత్ర కోసం ఇటీవలే శ్రీలంక వెళ్లింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని షాంగ్రీ-లా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ బసచేసింది. ఆదివారం ఉదయం ఆ కుటుంబమంతా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా.. వారిలోని ఓ యువతి ‘నిసాంగ మాయాదుమె’ సెల్ఫీ ఫొటో తీసుకుంది. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అక్కడ భయానక పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సదరు యువతి నిసాంగతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరికొంత మంది మరణించారు. అయితే.. వారందరూ మరణించారా? ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఆ కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దశాబ్ద కాలంలో శ్రీలంకలో ఇంతటి దారుణం జరగడం ఇదే తొలిసారి. కొలంబో వ‌రస పేలుళ్లపై ఆ దేశ పోలీసులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. మూడు హోట‌ళ్లు, మూడు చ‌ర్చిల‌తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. మొత్తం 8 పేలుళ్లలో.. ఆరు పేలుళ్లు ఆత్మాహుతి దాడి వ‌ల్ల జ‌రిగిన‌వేనని ఆ దేశ అధికారులు తేల్చారు. మొత్తం ఏడు మంది వ్యక్తులు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 24 మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Tags:The tragedy in Sri Lanka, which left tragedy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *