రైలు కిందపడతానే కానీ, మళ్లీ నీ దగ్గరికి రానన్నా

The train will fall down, but you do not see it again

The train will fall down, but you do not see it again

ఈనాడు.

Date :20/01/2018

నటి ఖుష్బూ

హైదరాబాద్‌: బాలనటిగా గుర్తింపు తెచ్చుకుని.. ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించిన సీనియర్‌ నటి ఖుష్బూ. ఆమె తన ఏడేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి ఎనలేని అభిమానుల్ని సంపాదించుకున్నారు. తమిళనాడులో ఆమె కోసం గుడి కూడా కట్టారు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 16 ఏళ్ల ప్రాయంలో ఖుష్బూ తన తండ్రి ఇంటి నుంచి తల్లిని, సోదరుడ్ని తీసుకుని బయటకి వచ్చేశారు.

ఈ విషయాన్ని ఆమె ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విచక్షణ లేని వ్యక్తని చెప్పారు. ‘నేను చిన్న వయసులోనే రెబెల్‌ అయిపోయా, మా నాన్నకు ఎదురుతిరిగా. కుటుంబం నుంచి మా అమ్మను, సోదరుడ్ని తీసుకుని వచ్చేశా. ఎందుకంటే.. ఆయన మహిళలను కించపరిచేలా మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. ఆయన అసభ్యంగా దూషించే భర్త’ అని చెప్పారు.

‘నాకు ఇంకా ఆ రోజు గుర్తుంది, అది 1986 సెప్టెంబరు 12. నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకురా అని ఆ రోజు మా నాన్న నాతో అన్నాడు. నా సోదరుడ్ని, అమ్మను చంపేసి.. నేనూ రైలు కిందపడిపోతానే కానీ మళ్లీ నీ దగ్గరికి తిరిగి రాను అని మా నాన్నతో చెప్పి వచ్చేశా.. అప్పటి నుంచి మా నాన్నను చూడాలని ఏ రోజూ అనుకోలేదు, చూడను కూడా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags : The train will fall down, but you do not see it again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *