వణికిస్తున్న నిపా వైరస్ 

The tremendous bursa virus

The tremendous bursa virus

Date:21/05/2018
 న్యూఢిల్లీ ముచ్చట్లు:
నిపా వైరస్ ప్రజలను వణికిస్తోంది. దీని బారిన పడి కేరళలో 10 మంది మరణించారు. వీరిలో ఓ నర్సు కూడా ఉన్నారు. మరో 20 మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వీరిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కోజికోడ్, మలప్పురం జిల్లాలో ఇటీవల పలువురు విష జ్వరాల బారిన పడ్డారు. వీరి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించగా.. వీరంతా ప్రమాదకర నిపా వైరస్ బారిన పడినట్లు తేలింది. సోమవారం ఉదయం వరకు వీరిలో 10 మంది మరణించగా, మరికొత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గబ్బిలాలు, పందులు తదితర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. నిపా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్యశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు కేరళ చేరుకున్న జాతీయ వ్యాధి నియంత్రణకు చెందిన ఉన్నత స్థాయి వైద్య బృందం సోమవారం వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది.నిపా వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ డెడ్లీ వైరస్ను అరికట్టడానికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు, ఔషధాలు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
Tags:The tremendous bursa virus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *