కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ

Date:16/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ శుక్రవారం విచారణ జరిగింది. స్పీకర్‌ మధుసూదనాచారి ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంటకరెడ్డిసంపత్‌లు హైకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎలాంటి దాడి జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగం తర్వాత కూడా మండలి చైర్మన్‌ బాగానే ఉన్నారనితర్వాత చాలా సేపటికి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని పిటీషన్‌లో తెలిపారు. ఎమ్మెల్యే సంపత్ వీడియోలో లేకపోయినా చర్యలు తీసుకున్నారనిసభ్యత్వం రద్దుపై ఎథిక్స్ప్రివిలేజ్ కమిటీలకు సిఫార్సు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సభ్యత్వాలు రద్దు చేశారన్న పిటిషనర్లు వాపోయారు. అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనిపూర్తి ఫుటేజీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోమటిరెడ్డి వెంటకరెడ్డిసంపత్‌లు కోరారు. అయితే కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది. ఈ కేసుపై విచారణ సోమవారానికి వాయిదా కోర్టు వేసింది.
Tags: The trial in the High Court to cancel the membership of the Congress MLAs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *