దసరా తర్వాత  శబరిమలై పై విచారణ

The trial of Sabarimala after Dussehra

The trial of Sabarimala after Dussehra

Date:09/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను తక్షణం విచారించలేమంటోంది సుప్రీంకోర్టు. మంగళవారం రివ్యూ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగ్గా.. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపలేమని.. జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. దసరా పండుగ తర్వాతే ఈ పిటిషనపై విచారణ జరుపుతామని తెలిపింది. శబరిమల ఆలయంలోకి ప్రవేశంపై సుప్రీంకోర్టులో సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలయ్యింది. ఆలయ ప్రవేశానికి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ.. జాతీయ అయ్యప్ప స్వామి భక్తుల సంఘం పిటిషన్ వేసింది. అలాగే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ కూడా మరో పిటిషన్ దాఖలు చేసింది.
ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తే ఆలయ ఆచారాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. కోర్టు తీర్పు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. వారి హక్కుల్ని కాలరాసే విధంగా ఉందన్నారు. దీనిపై స్పందిస్తూనే తక్షణ విచారణకు కోర్టు నిరాకరించింది. సెప్టెంబర్ 28న అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు కేరళ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతుండగా.. ఆదివారం చెన్నై, ఢిల్లీలో కూడా భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా రోడ్డెక్కి గళమెత్తుతున్నారు.
Tags:The trial of Sabarimala after Dussehra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed