Natyam ad

మారని దొంగ తీరు.. పదేపదే దొంగతనాల జోరు

అమరావతి ముచ్చట్లు:

దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ పలు మార్లు జైలు శిక్ష అనుభవించిన దొంగలో మార్పు రాలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా తన చోరకళను ప్రదర్శిస్తూనే వున్నాడు. పైగా, జైలులో పరిచయం అయిన మరో ఇద్దరితో ముఠాగా ఏర్పడి తిరిగి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 13 తులాల బంగారం 36 తులాల వెండిని రికవరీ చేసిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు.సూర్యాపేట జిల్లా చిలుకూర్ గ్రామానికి చెందిన కిన్నెర మధు కొన్నేళ్ళ నుంచి చిలుకూర్, కోదాడ, నడిగూడెం, హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనలు చేసి, పలుమార్లు జైల్ శిక్ష కూడా అనుభవించాడు.గతంలో కోదాడ పట్టణ పోలీసులు ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. చిలుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, జిల్లా జైల్ లో ఉండగా, జైల్ లో పెద్ద తాళ్ల కుమార్, మాటూరి సంపత్ లతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు జైల్ నుండి విడుదల అయిన తరువాత దొంగతనాలు చేద్దామని ప్లాన్ చేసుకున్నారు.జైలు నుండి బయటకు వచ్చిన తరువాత సూర్యాపేట, వరంగల్, జనగమ జిల్లాలలో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరు ముగ్గురు దొంగిలించిన బంగారు మరియు వెండి వస్తువులను శుక్రవారం ఉదయం హుజూర్ నగర్ పట్టణంలో అమ్ముదామని మోటార్ సైకల్ పై వచ్చారు. ఇందిరా చౌక్ వద్ద హుజూర్ నగర్ SI వారి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తూ పాత నేరస్తుడైన కిన్నెర మధును మరో ఇద్దరినీ పట్టుకున్నారు. దీంతో తాము చేసిన దొంగతనాలు పోలీసులకు వివరించారు. వారి వద్ద నుండి 13 తులాల బంగారు వస్తువులు, 36 తులాల వెండి మరియు రోల్డ్ గోల్డ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక మోటార్ సైకల్ ను స్వాధీనపరుచుకొని నిందితులను న్యాయస్థానం నందు హాజరుపర్చామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

 

Post Midle

Tags: The unchanging style of the thief.. Repeated thefts

Post Midle

Leave A Reply

Your email address will not be published.