మేడ్చల్ లో కలుషితమౌతున్న భూగర్భ జలాలు

The underground waters contaminated in Medchal

The underground waters contaminated in Medchal

Date:06/10/2018
రంగారెడ్డి ముచ్చట్లు:
చుట్టు నాలుగు కిలోమీటర్ల పొడవున ముక్కుపుటాలు అదరిపోయే వాసన…సాయంత్రం అయిందంటే చాలు ఎదుటి వారు కనిపించనంత ముసిరే దోమలు..బోరు మోటరు ఆన్ చేస్తే నురగకక్కే నీరు..పీల్చే గాలి,తాగే నీరు ఇలా అన్ని కలుషితమే ..ఇది ఎక్కడో పారిశ్రామిక వాడలో ఉన్న పరిస్తితి కాదు..నగరానికి ఆనుకుని ఉన్న జవహర్ నగర్ ప్రాంతం.. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న డంపింగ్ యార్డ్.మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ప్రాంతం గురించి తెలియని వారుండరు. ఈ ప్రదేశం ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో వార్తల్లోకి ఎక్కతూనే ఉంటుంది.
అక్రమ భూకబ్జాలని, చిన్నారులను వదివెళ్లటం, పోలీసు అఘాయిత్యం ఇలా నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. కాని ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం వీటిన్నిటిలో భిన్నమైనది..ప్రమాదమైనది.. సుమారు 9 సంవత్సరాల నుండి గ్రేటర్ పరిధిలో ఉన్న చెత్త అంతా ఇక్కడే డంప్ అవుతుంది. నిత్యం ఈ ప్రాంతానికి 4వేల మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరుతుంది. ఇందులో నుండి తడి,పొడి చెత్తను వేరు చేసి రసాయనక ఎరువులను తయారు చేస్తారు.
2009లో ప్రభుత్వం ఈ నిర్వహణను రాంకీ సంస్థకు అప్పగించింది.ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాంకీ సంస్థకు వీటి నిర్వహణను అప్పగించి 9 ఎకరాల భూమిని కేటాయించింది. వారికి ఆ స్థలంలో ఒక లేయర్ చెత్తను మరో లేయర్ మట్టిని వేయమని, అలా చేస్తే స్థానికంగా నివసించే వారికి ఎటువంటి రోగాలు తలెత్తవని తెలియజేసింది. కాని రాంకీ సంస్థ మాత్రం తన సొంత ప్రయోజనాల కొరకు ఈ పద్దతిని నీరు కార్చింది. ఎక్కడి చెత్తను అక్కడే ఉండేలా చూసింది.
అలా శుద్ది చేయకుండా అంతా చెత్త ఒకే చోట ఉండటంతో భూగర్బజలాలు కలుషితమవుతున్నాయి. రసాయనక ఎరువులు కాదు కదా..విషవాయువులు ప్రభలుతున్నాయి. కలుషితమైన రసాయనాలు భూమిలోకి ఇంకిపోయి తాగే నీటిలో సైతం నురగలు కక్కుతూ దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నాయి. పీల్చే గాలి కూడా కలుషితమై వస్తుంది.ఈ సమస్య ఇప్పటిది కారు దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఈ డంపింగ్ సమస్య ఇక్కడ నివసించే ప్రజలను వెంటాడుతుంది.. కలుషితమైన గాలిని పీల్చటం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నారు.
చిన్న పిల్లలు భయట ఆడుకోవాలంటేనే భయపడుతున్నారు. కొద్ది సేపు బయటకు వచ్చినా సరే ఈ డంపింగ్ యార్డ్ ను నుండి వచ్చే దుర్వాసనకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాగునీటితో మురుగు నీరు కలవటంతో తాగలేక పోతున్నారు. ఇలా వాళ్ల సమస్యను ఎంత మంది అధికారులకు చెప్పినా కూడా వారి భాదను పట్టించుకునే నాధుడే కరువైపోయాడు. చివరికి వారి సమస్యను నిత్యం చూస్తున్న రాంకీ సంస్థ కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది.
దొంగలు పడ్డ ఆరునెళ్లకు కుక్కలు మొరిగినట్టు.. అంతా అయిపోయాకా ఇప్పుడు ప్రభుత్వం ఒక సారి డంపింగ్ యార్డ్ పై కన్నేసింది. ఇన్ని రోజులకు వారికి ప్రజల ఘోడు అర్థమైనట్టుంది. అందుకే త్వరలో గ్రీన్ క్యాంపింగ్ పేరులో కొత్తగా క్లీనింగ్ చర్యలు చేపట్టబోతుంది. దీనితో ఇక పై డంపింగ్ వల్ల తలెత్తే సమస్యలు నివారించవచ్చని ప్రజలకు హామి ఇచ్చింది.
ఈ క్లీనింగ్ ప్రాసెస్ తో ఎప్పటికప్పుడు వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా రీసైకిలింగ్ చేయటంతో కొద్దిలో  కొద్దిగా కాలుష్యాన్ని, అదే విధంగా దుర్వాసనను నివారించొచ్చని అంటూంది.ఏది ఏమైనా కాని ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు మాత్రమే.. ఇన్నాళ్ళకు ప్రభుత్వం ముందుకొచ్చి చేపడుతున్న గ్రీన్ క్యాంపింగ్ ప్రాసెస్ ఎంతో వరకు సక్సెస్ అవుతుందో, దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Tags:The underground waters contaminated in Medchal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *