ముందుకు సాగని ఫించా ప్రాజెక్టు

The unfinished Finch project

The unfinished Finch project

Date:14/09/2018
కడప ముచ్చట్లు:
పింఛా ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు మొదటి నుంచి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ పనులకు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి మంత్రి సునీతా లక్ష్మారెడ్డి శిలాఫలకం వేసి వెళ్లారు. పలు కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో సమస్య అలాగే ఉండి పోయింది.
మళ్లీ గతేడాది డిసెంబర్‌లో ఈ గేట్ల పునరుద్ధరణకు నీరు–చెట్టు పథకం కింద రూ.2.90 కోట్లు కేటాయించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. టెండర్లను స్వప్న ఇన్‌ఫ్రా కంపెనీ దక్కించుకుంది. అగ్రిమెంటు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో గేట్ల పునరుద్ధరణ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గేట్లు తుప్పుపట్టి నీళ్లు వృథాగా పోతున్నా పునరుద్ధరణ పనులు జరగక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గేట్ల లీకేజీ కారణంగా పొలాలకు ఏ మాత్రం ఉపమోగం లేకుండా నీరు పోతోంది. అధికారులు మాత్రం రూ.2.90 కోట్లతో నీరు–చెట్టు నిధుల కింద గేట్ల పునరుద్ధరణకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు చేపడుతామని చెబుతున్నారు.
కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయిఈ ప్రాజెక్టును 1962లో నిర్మించారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిర్మాణం చేపట్టారు. నీటి సామర్థ్యం 0.327 టీఎంసీలు. మూడు వర్టికల్, రెండు స్వే్కర్‌ గేట్లు ఉన్నాయి.
గేట్లు తుప్పు పట్టడం వల్ల రోజూ 10 క్యూసెక్కులు నీళ్లు వృథాగా పోయి చెయ్యేరులో కలుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చినా.. గేట్ల లీకేజీ కారణంగా వృథాగా పోతున్నాయని వారు వాపోతున్నారు.ఈ మధ్యలో వర్షాలు బాగా పడి ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి చేరితే పనులు మొదలు పెట్టే అవకాశం ఆమడ దూరంలో ఉండక తప్పదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి త్వరలో పింఛా ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు మొర పెట్టుకుంటున్నారు.
Tags:The unfinished Finch project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *