కేంద్రమంత్రిని తొలగించాలి

Date:20/11/2018
నెల్లూరుముచ్చట్లు:
సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుంది. ఈ రోజు సీబీఐ విశ్వసనీయత రోడ్లపై పడింది. నిజాయతీపరుడైన అధికారి అయిన సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా ఆ సంస్థ బండారాన్ని బయటపెట్టారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
మంగళవారం నాడు అయన నెల్లూరులో ధర్మపోరాటం సభ వద్ద మీడియాతో మాట్లాడారు. సీబీఐ అంటే సెంట్రల్ బోగస్ ఇన్విస్టిగేషన్ అని, ఈడీ అంటే ఎక్సట్రాక్షన్ డైరెక్టరేట్ అని మనీష్ కుమార్ పేర్కొన్నారు. సీబీఐ కేసుల్లో కేంద్ర మంత్రి పార్ధివ్ భాయ్ చౌదరి లంచాలు సుకుంటున్నారని సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేసే పరిస్థితి వచ్చింది. తక్షణమే పార్ధివ్ భాయ్ చౌదరిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని అయన అన్నారు.
సీబీఐ భ్రష్టుపట్టిపోయి పరువు పోగొట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐకి మేం కన్సెంట్ ఉపసంహరించాం. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తే పరిస్థితి వచ్చింది.  న్యాయమూర్తులు ఐదుగురు బయటకు వచ్చి సుప్రీంకోర్టు వ్యవస్థపై తిరుగుబాటు చేసే పరిస్థితులు వచ్చాయి. మోదీ, అమిత్ షాలు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. వారి స్వార్ధ, హత్యా, కుట్ర రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు.
కేసులు, స్వార్ధ ప్రయోజనాల కోసం  రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రజలప్రయోజనాలను తాకట్టుపెట్టి బీజేపీతో లాలూచీపడ్డాయని అన్నారు. దేశ సమగ్రతను, భవిష్యత్తును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. దేశంలోని శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి మోదీ అవినీతి, నియంతృత్వ పాలనపై పోరాడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోని జాతీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్నారని మంత్రి అన్నారు.
Tags: The Union Minister should be removed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *