న్యాయ వ్యవస్థను అస్థిర పరిచే కుట్ర జరుగుతోంది

The unjustified conspiracy is going on
-జస్టిస్ అరుణ్ మిశ్రా
Date:24/04/2019
న్యూ డిల్లీ ముచ్చట్లు:
న్యాయ వ్యవస్థను అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పై  జూనియర్ కోర్టు మాజీ అసిస్టెంట్(జేసీఏ) ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అలాగే, గొగొయ్ పై లైంగిక వేధింపుల కేసును తమ తరపున వాదించాలని, ఆయనకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తే పెద్దమొత్తంలో తమకు డబ్బు ఇస్తామని ఓ వ్యక్తి ప్రలోభ పెట్టారని సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించడం మరో సంచలనం. ఈ నేపథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ, న్యాయ వ్యవస్థను అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించారు. న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్ పైనే ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, ఆ అఫిడవిట్ తో పాటు మాజీ ఉద్యోగిని ఆరోపణలపై సమాంతర విచారణ జరపాలని కోరారు.

రోజుకో మలుపు తిరుగుతున్న గొగోయ్ కేసు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను కుట్రపూరితంగా లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ముమ్మర విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు సమన్లు జారీ చేసింది. దీనిపై చర్చించేందుకు ఈ మూడు సంస్థల చీఫ్ లు ఈరోజు న్యాయమూర్తుల ఛాంబర్ కు రావాలని ఆదేశించింది. రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది.మరోవైపు, డబ్బు తీసుకుని తీర్పు చెప్పించే దళారీ వ్యవస్థకు రంజన్ గొగోయ్ చెక్ పెట్టినందుకే ఆయనను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ బైంసా అనే లాయర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పడంతో… ఆధారాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆయనకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఆరోపణలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత విషయంలో పెను సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు జస్టిస్ గొగోయ్ సిద్ధపడటం గొప్ప విషయమని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని ప్రశంసించారు. ఏదైనా కుట్ర ఉంటే మాత్రం… ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో వైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను కుట్రపూరితంగా లైంగిక వేధింపుల కేసులో ఇరికిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ముమ్మర విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ సీబీఐ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ లకు సమన్లు జారీ చేసింది. దీనిపై చర్చించేందుకు ఈ మూడు సంస్థల చీఫ్ లు ఈరోజు న్యాయమూర్తుల ఛాంబర్ కు రావాలని ఆదేశించింది. రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది.మరోవైపు, డబ్బు తీసుకుని తీర్పు చెప్పించే దళారీ వ్యవస్థకు రంజన్ గొగోయ్ చెక్ పెట్టినందుకే ఆయనను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ బైంసా అనే లాయర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పడంతో… ఆధారాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆయనకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది.ఈ నేపథ్యంలో జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఆరోపణలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత విషయంలో పెను సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు జస్టిస్ గొగోయ్ సిద్ధపడటం గొప్ప విషయమని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని ప్రశంసించారు. ఏదైనా కుట్ర ఉంటే మాత్రం… ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Tags:The unjustified conspiracy is going on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *