The use of chemical pesticides should be minimized

 రసాయన పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలి

Date:5/08/2020

మద్దికేర ముచ్చట్లు:

రసాయన పురుగుల మందుల వాడకాన్ని రైతులు పూర్తిస్థాయిలో తగ్గించాలని వ్యవసాయ అధికారులు తెలియజేశారు.బుధవారం రోజున మండల కేంద్రమైన మద్దికేరలో నిర్వహించిన పొలం కార్యక్రమంలో భాగంగా రైతులకు వేరుశనగ పంట సాగుపై అవగాహన కల్పించారు.అదే విధంగా మద్దికెర గ్రామంలో వేరుశనగ పంట నందు పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ సహాయకులు జాకీర్ హుస్సేన్  రైతులకు రసాయనిక పురుగు మoదులు వాడడం వలన కలిగే విష ప్రభావాల మీద మరియు మొలక పరీక్షల ఉపయోగం పై  రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా రైతులు పంట సాగులో పాటించాల్సిన మెలుకువలు గురించి వ్యవసాయ అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో విఏఏ లు ఆనంద్,రాణి,కవిత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

జైల్లో ఉన్నకొడుకు కోసం ఓ తల్లి సాహసం 

Tags:The use of chemical pesticides should be minimized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *