వెలుగొండ ప్రాజెక్టు నెరవేరేలా లేదు

The Velugonda project is not fulfilled

The Velugonda project is not fulfilled

Date:31/12/2018
ఒంగోలు ముచ్చట్లు:
వెలుగొండను పూర్తిచేయాలనే సిఎం చంద్రబాబు కల ఎన్నికల నాటికి నెరవేరేలా కనిపించడం లేదు. వెలుగొండ ప్రాజెక్టును నేనే చేపట్టాను. నేనే ప్రారంభిస్తాను. అంటూ సిఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చెబుతూనే వస్తున్నారు. ఇప్పటికే ఆరు సార్లు గడువులు పెట్టారు. అమలు కాలేదు. వాస్తవంగా చూస్తే రైతుల్లో చంద్రబాబుపై నమ్మకం లేదు. గతంలో 9 ఏళ్ల పాలనలోనూ, ఇపుడు అధికారంలోకొచ్చాక చూస్తే పనులు ఏ మాత్రమూ ముందుకు సాగకపోవడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఏమిటో విధితమవుతోంది.  నాలుగేళ్లూ వెలుగొండ ప్రాజెక్టు గురించి  పట్టించుకోని ఆయన పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేల వత్తిళ్లతో చివర్లో దృష్టి సారించారు. ఇపుడు హడావిడిగా పనులు చేపట్టాలంటే సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
గడిచిన నాలుగేళ్లలో పనులపై దృష్టి సారించి చర్యలు చేపడితే ఇప్పటికి పూర్తవ్వడానికి అవకాశాలుండేవి. కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిపేయడంతో ఏళ్ల తరబడి పనులు ముందుకు సాగలేదు. గతేడాది కాంట్రాక్టర్లను మార్చాలని నిర్ణయించారు. పాతవారికి తొలగించి కొత్తవారికి పనులు అప్పగించారు. కొత్త కాంట్రాక్టర్లు రెండు నెలల నుంచీ పనులు చేపట్టారు. ఇప్పటికీ 150 మీటర్ల సొరంగం తవ్వారు. ఇంకా 3.5 కిలోమీటర్లు మిగిలే ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. గత నెలలో మార్టూరు వచ్చినపుడు సిఎం చంద్రబాబు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వెలుగొండను ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో జిల్లాకు వచ్చిన ఐదారు సార్లూ ఇదే హామీ ఇచ్చారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇదే తీరున సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అర కిలోమీటరు కూడా సొరంగం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నెలకు కిలోమీటరున్నర సొరంగం తవ్వితేనే పూర్తవుతుంది. పనుల్లో వేగం కనిపించడం లేదు.
ఈనెల 12న జిల్లాలో జరిగిన జ్ఞానభేరి సభకు హాజరైన సిఎం చంద్రబాబు సభ ముగిశాక వెలుగొండపై ఇంజనీరింగ్‌ అధికారులతో ఆరా తీశారు. పనులు వేగంగా జరగడం లేదని ప్రజా ప్రతినిధులు సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వెలుగొండ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. బోరింగు మిషనులో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రారంభంలో వేసిన కన్వేయర్‌ బెల్టు తెగిపోతున్నప్పటికీ నాలుగు కిలోమీటర్లకుపైగా దీన్ని మార్చేశారు. పనులు నిదానంగా సాగుతున్నాయి. రోజుకు పదిమీటర్లు కూడా జరగడంలేదు. 18.82 కిలోమీటర్ల సొరంగం పనులు జరగాల్సి ఉన్నాయి. అయితే ఇంకా 3.5 కిలోమీటరు మిగిలింది. తాజాగా ఈ పనులను రూ.292.15 కోట్లతో మెగా ఇంజనీరింగ్‌ కంపెనీకి అప్పగించారు. పాత మిషనుతోనే పనులు చేపడుతున్నారు. దీంతో పాత కాంటాక్టర్లకూ, కొత్త కాంటాక్టర్లకూ పనుల్లో ఏమీ తేడా లేదు.
Tags:The Velugonda project is not fulfilled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed