Date:26/01/2021
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బివి జయ నాగేశ్వర రెడ్డి తన గృహం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందుగా ఆయన ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. వైసీపీ తీసుకుంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అన్ని మా మండలానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించిన దినంగా ప్రకటిస్తూ మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించామని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజ్యాంగేతర నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం తీసుకుంతొందని బివి మండి పడ్డారు. రాజ్యాంగేతర నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లో, ప్రజల్లో అబాసుపలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయ మూర్తులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతూ రాష్ట్రంలో ఓ భయానకర వాతావరణం ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యావ్యవస్థలో తెలుగును అమలు చేయడంలో కూడా రాజకీయం చేస్తూ రాజ్యాంగేతర నిర్ణయాలకు పాల్పడుతున్న విషయం వాస్తవం కాదా మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ది చెప్తారనే భయంతో వెనకడుగు వేస్తున్నారని, ఓ వైపు సంక్షేమ పథకాల అమలు పేరుతో ప్రజలను మాయ చేస్తూ మరోవైపు నిత్యావసర వస్తువులు, ఇసుక, పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి మరో చేత్తో ప్రజల నుండి లాగేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తప్పకుండా బుద్ది చెప్తారనే బివి పేర్కొన్నారు.
విశిష్ట సేవలందించిన ఎంవిఐ సుబ్రమణ్యంకు కలెక్టర్ చే ప్రశంసాపత్రం
Tags: The verdict given by the Supreme Court is like a slap in the face to the YCP government