మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో స్పందన అర్జీ ఇస్తే న్యాయం జరగలేదని అక్కడే విషం తాగిన బాధితుడు
మదనపల్లి ముచ్చట్లు:
సబ్ కలెక్టర్ కు అర్జీ ఇస్తే స్పందించి న్యాయం చేయలేదని ఓ బాధితుడు స్పందనలు అర్జీ ఇచ్చి సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజక వర్గంలోని రామసముద్రం ఆంజనేయ స్వామి కాలనీలో కాపురం ఉంటున్న తలారి నాగప్ప కుమారుడు తలారి శ్రీరాములు (54) గత 15 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం తహసీల్దార్ కు, సబ్ కలెక్టర్ కు, జిల్లా కలెక్టర్కు అర్జీలు ఇచ్చిన ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు. ఉన్న స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకుని తను ఉంటున్న గుడిసెను దొబ్బేయడంతో మనస్థాపం చెంది సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆర్డీవోకు స్పందనలో అర్జీ ఇచ్చాడు. ఆర్డీవో శ్రీనివాసులకు న్యాయం చేయకపోవడంతో తిరిగి తిరిగి ఓపిక నశించి, తీవ్ర మనస్థాపంతో జీవితం పై విరక్తితో సబ్ కలెక్టర్ ఆఫీసులోనే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి బాధితుని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

Tags: The victim who drank poison said that justice was not served if he filed a response in Madanapally sub collector’s office.
