గెలుపు నాదే : బీజేపీ 

The victory is mine: BJP
Date:09/11/2018
మేడ్చల్ ముచ్చట్లు:
మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ  అభ్యర్ధి రాంచందర్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరిలోని 141 డివిజన్, గౌతమ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రచారంలో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. కాంగ్రెస్ ను,  టిఆర్ఎస్ ని గెలిపించా. అభివృద్ధి శూన్యంగా ఉంది. మరి ఈ సారి బీజేపీ కి అవకాశం ఇవ్వమని పిలుపునిచ్చార.  ప్రజలు నుండి మంచి స్పందన లభించిందన్నారు. అయితే గత ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు 76,000 ఓట్లను ఇచ్చారు, కానీ అతి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించలేకపోయమని అన్నారు. కానీ ఈ సారి బీజేపీ గెలుపు ఖాయం మల్కాజిగిరిని ఒక క్లీన్ నియోజకవర్గంగా  తీర్చి దిద్దుతానని తెలిపారు. ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Tags: The victory is mine: BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *