మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వీడియో విడుదల
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
నిషేధిత మావోయిస్టు పార్టీ పలు డిమాండ్లతో ఒక వీడియో విడుదల చేసారు. 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సవాహంతో జరపాలి. ఆదివాసీ స్వయంప్రతిపత్రికై మిలిటెంట్ ఉద్యమాలను నిర్మించాలి. ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి. ఆదివాసీ ప్రాంతాల్లో స్వయంపాలనకై 1/70 చట్టం, 1996 పీసాచట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, ఐదవ,ఆరవ షెడ్యూల్, జీవో నెంబర్ 3 అమలుకై పోరాటాలు చేయాలి. అడవుల నుండి ఆదివాసీల గెంటివేతకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆదివాసిగూడెం ల లో ఎత్తివేసిన పాఠశాలను పునరుద్ధరించాలి,వాటిలో ఆదివాసీలనే ఉపాధ్యాయులుగా నియమించాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచాలి. కవ్వాల టైగర్ జోన్ అభయారణ్యాలను ఎత్తివేయాలి. అదిలాబాదులో గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రత్యేక డిఎస్సి తో ఆదివాసీలకే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలి. ఆదివాసి బంధును వెంటనే ఏర్పాటు చేయాలి. అభయారణ్యాలను నాశనం చేసే గనుల ఏర్పాటును వ్యతిరేకించాలి. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో గిరిజనులకు ఇంట్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలి. ఇలా
పలు డిమాండ్లతో కూడిన వీడియోను మీడియాకి విడుదల చేసారు.
Tags; The video was released with many demands under the leadership of the Maoist party

